తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.
Read More »బీజేపీపై మంత్రి హరీష్ రావు ఫైర్
‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్ భగీరథ’ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్ర చేసింది. ‘తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షలకుపైగా కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కల్పించాం’ అని కేంద్ర …
Read More »తెలంగాణలో కొలువుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని.. గ్రామాల్లో పనిచేయడానికి ఇష్టపడే వారి సర్వీసును కౌంట్ చేస్తూ, పీజీ అడ్మిషన్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
Read More »సర్కారు బడుల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.500
తెలంగాణలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (మ) సర్పంచ్ శారదా ప్రవీణ్.. సర్కారు బడులను బలోపేతం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సర్కారు బడిలో చేరే పిల్లలకు ప్రతి నెలా రూ.500 చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గ్రామస్తులు సర్పంచ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
Read More »రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ర్టానిక్స్ యూనిట్‌లో మరో నూతన …
Read More »ఈ నెల 20న వరంగల్, హనుమకొండ ల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీబండ్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి …
Read More »పరకాలలో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ & పురపాలక శాఖ మంత్రివర్యులు,తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామంలో మొక్కలు నాటి,కేక్ కట్ చేసిన జన్మదిన వేడుకలు నిర్వహించిన పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిపి,జెడ్పిటిసి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,ఎంపిడిఓ, తెరాస నాయకులు, …
Read More »సెల్యూట్ పోలీస్
కరోనా వైరస్ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదుచేసి 258 మందిని అరెస్ట్‌చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా ఔషధాల బ్లాక్‌మార్కెటింగ్‌పై ఎవరికైనా సమాచారముంటే 100 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, @telanganadgpకి ట్వీట్ …
Read More »ఫలితాలపై సమీక్షించుకుంటాం:మంత్రి కేటీఆర్
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఫలితాలు ఎందుకు రాలేదనే విషయంపై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. సమీక్ష అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారు. దుబ్బాక ఫలితంతో అప్రమత్తం అవుతామన్నారు. తాము విజయాలకు పొంగిపోము, ఓటమికి కుంగిపోమన్నారు.
Read More »