తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా వత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పటంతో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. …
Read More »రైతన్న కోసం రణమే.. పార్లమెంటులో గళమెత్తండి- సీఎం కేసీఆర్
ఆహారధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వ అయోమయ, అస్పష్ట విధానం తెలంగాణ రైతాంగానికే కాకుండా.. యావత్ దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఆహారధాన్యాల సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, పార్లమెంటు వేదికగా ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ …
Read More »