తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఐఏఎస్ అధికారిణి అయిన స్మితా సబర్వాల్ ఇంటిలోకి డిప్యూటీ ఎమ్మార్వో చొరబడిన సంఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు మ్యాటర్ మాట్లాడేందుకే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ క్వార్టర్ కు వెళ్లినట్లు మాజీ డిప్యూటీ తహసీల్దార్ ఆనందర్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆనందకుమారెడ్డితో పాటు మరో 9 మంది అధికారుల పదోన్నతుల కోసం …
Read More »ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ
ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు.
Read More »ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూశారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగానే చికిత్స చేయించుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో …
Read More »సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ సౌజన్యం సుమారు రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కమిటీ హాల్ స్థలాన్ని ఏళ్లుగా …
Read More »బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివరాజ్ పాంగి, ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు శిశిర్ …
Read More »రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More »బాసర ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు …
Read More »గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని గవర్నర్ మర్చిపోయారా-
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త భవనాలు అభివృద్ధి కాదంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అంటే గవర్నర్ తమిళ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని అనుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో …
Read More »కలిసి ఉంటే సమస్యలు పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
ప్రజలు కలిసి మెలసి ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా తొర్రూరు గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, జాతర వేడుకల్లో మంత్రి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కంఠమహేశ్వర స్వామి కృపతో గౌడ సంఘం సభ్యుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. …
Read More »సందల్ షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ ఆస్తానా ఈ మెహబూబియా చమాన్ దర్గా కాద్రియ మంజూర్ షా ఖాద్రీ వద్ద నిర్వహించిన సందల్ షరీఫ్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాదర్ సమర్పించారు. అనంతరం ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రషీద్ బైగ్, హుస్సేన్, …
Read More »