కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లి 15వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సదానందం (38) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బీఆర్‌ఎస్ సభ్యత్వం పొంది ఉండడంతో పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అతని నివాసానికి వెళ్లి స్థానిక కౌన్సిలర్ భరత్ గారితో కలిసి కుటుంబ సభ్యులకు అందజేశారు. …
Read More »బీఆర్ఎస్ ప్రభుత్వం తీపికబురు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వృద్ధులైన వేద పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి ప్రతి నెలా ఇస్తున్న రూ.2500 గౌరవ భృతిని పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వారికి నెలకు రూ.5000 అందనున్నాయి. అంతేకాదు భృతి పొందే వేద పండితుల వయసును 75 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీంతోపాటు వేద పాఠశాలల నిర్వహణకు ప్రతి ఏటా రూ. …
Read More »టిబీజేపీ నేత కిడ్నాప్
తెలంగాణలో హైదరాబాద్ లోని తెలంగాణ బీజేపీకి చెందిన నేత తిరుపతి రెడ్డి కిడ్నాప్ అయ్యారు. ఈ మేరకు ఆయన భార్య ఆల్వాల్ పీఎస్ లో ఫిర్యాదుచేశారు. ఆ వివరాల ప్రకారం దాదాపు 5929 గజాల స్థలం విషయంలో ఆయనకు ప్రత్యర్థులతో వివాదం ఉన్నట్లు సమాచారం. తిరుపతి రెడ్డి స్వస్థలం జనగామ జిల్లా దుబ్బకుంట నివాసి.. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. తిరుపతి రెడ్డి …
Read More »మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు
తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు మారాయి. ఇందులో భాగంగా నగరంలోని జూబ్లీ బస్టేషన్ (జేబీఎస్), మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) మధ్య కారిడార్-II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం అధికారులకు టాస్క్ గా మారింది. ప్రధానంగా ఆఫీసు వేళల్లో మెట్రోల్లో …
Read More »మంత్రి ఎర్రబెల్లికి ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం జేఏసీ, అభిమానులు ఘన స్వాగతం
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన తానా సభలకు హాజరై, 10 రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సనర్భంగా మంత్రి కి ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం జేఏసీ, …
Read More »యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఇల వైకుంఠ పురంగా యాదాద్రి వెలిసిందని, సీఎం కెసిఆర్ గారి కృషి వల్ల భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని …
Read More »ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం…
తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్ స్టాప్ సెంటర్ …
Read More »అందరికి న్యాయం చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతం!
వి.ఆర్.ఏ లకు పే స్కేల్ ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి నేడు వేములవాడలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన అర్బన్, రూరల్ మండలాల వి.ఆర్.ఏలు! ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమతం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అప్పటినుండి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …
Read More »కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేఖ వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే సండ్ర
అమెరికా వేదికగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటుపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రైతే రాజుగా ఉండాలని రైతు ఆత్మగౌరవంతో బతకాలని కెసిఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును తాము అధికారంలోకి వస్తేమూడు గంటలకే కుదిస్తామనడంతో రైతాంగం భగ్గుమంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖండించారు. రైతులతో కలిసి వేంసూరు మండలం మర్లపాడు …
Read More »ఘనంగా సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం
సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సమావేశం నియోజకవర్గ కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది.. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ దినేష్ చౌదరి గారు,ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య గారు హజరయ్యారు.. ఈ సందర్భంగా దినేష్ …
Read More »