Home / Tag Archives: trsgovernament (page 255)

Tag Archives: trsgovernament

సాగర్ అప్డేట్ -6వ రౌండ్ ముగిసే సరికి ఎవరికి ఆధిక్యం ..?

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఐదవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 4,334 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3,442 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 2,676ఓట్లు, బీజేపీ అభ్యర్థి  రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.అయితే ఆరో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 5,177 ఓట్ల …

Read More »

క‌రోనాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క సూచ‌న‌లు

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు స‌మీక్ష జ‌రిపి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజ‌న్, వ్యాక్సిన్, బెడ్ల ల‌భ్య‌త‌లో ఎలాంటి లోపం రానివ్వొద్ద‌ని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి రాష్ర్టాన్ని క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి హారీష్

పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్‌లో హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని, మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి …

Read More »

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గతనెల 20వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బుధవారం …

Read More »

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే

పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్‌. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలంలోని 168 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ …

Read More »

మినీ పురపోరు -ఖమ్మం,సిద్దిపేటలో పోలింగ్ 15 శాతం

 తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ వంతుకోసం లైన్లలో నిలబడ్డారు. దీంతో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదయింది. అదేవిధంగా అచ్చంపేటలో 11 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 15 శాతం, నకిరేకల్‌లో …

Read More »

తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కొత్తగా 5,926 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,606కు పెరిగాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. …

Read More »

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌త‌

తెలంగాణ‌లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. రేప‌ట్నుంచి 19 జిల్లా డ‌యాగ్నొస్టిక్ హ‌బ్‌లు ప్రారంభిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారికి జిల్లా డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల్లో ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారు 3, 4 రోజుల‌కు ఒక‌సారి ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. రాష్ర్టంలో ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని …

Read More »

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి ఈట‌ల ఫైర్

కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేత‌లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ప‌రిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ‌లో 4 రాష్ర్టాల‌కు చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. మేం కేంద్రాన్ని విమ‌ర్శించ‌ట్లేదు.. వారే …

Read More »

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతపై కీలక ప్రకటన

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు పాస్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించిన వారే పాస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని సూచించారు. అది తప్పుడు వార్త అని.. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat