తెలంగాణలో కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితాను సిబ్బంది నమోదు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్మికులతో కూడిన మొత్తం 707 బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41,305 ఇండ్లను సర్వే చేశాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ బృందాలు 19,090 మందిని బస్తీ …
Read More »తెలంగాణలో 6,026 కరోనా కేసులు
తెలంగాణలో మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 6,026 పాజిటివ్ కేసులు రికార్డవగా.. 52 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా.. 6,026 కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. తాజాగా వైరస్ నుంచి 6,551 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 క్రియాశీల కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,115, …
Read More »ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారని తెలిపారు. ధాన్యం …
Read More »తెలంగాణలో నియంత్రణలోనే కరోనా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, డిఎం & హెచ్.ఓ.ల తో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియా తో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు …
Read More »అజిత్ సింగ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ …
Read More »తెలంగాణలో మరో ఇంటింటి సర్వే
కరోనాతో పోరులో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇందుకోసం 11,600 బృందాలను ఏర్పాటు చేసింది. వీరు కరోనా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించనున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు.
Read More »ఈటల అలా వ్యాఖ్యానించడం సరికాదు : వినోద్ కుమార్
ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుబట్టారు. తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా ప్రజా నాయకుడు కేసీఆర్‌ను ఈటల ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ఈటల విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ఆ పథకాలను …
Read More »ఈటల ఒక మేకవన్నె పులి : మంత్రి గంగుల
ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి. బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర. ఆయన హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈటల చెబుతున్నారు. కేవలం దేవరయాంజల్ భూముల కోసమే ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి …
Read More »నేడు ఈటల కీలక ప్రకటన
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఇవాళ హుజూరాబాద్లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.
Read More »హైకోర్టుకు మాజీ మంత్రి ఈటల కుటుంబం
తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని హైకోర్టులో ఈటల రాజేందర్ భార్య, కొడుకు, జమునా హేచరీస్ పిటిషన్ వేశారు. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని, అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు. ఇది నేడు విచారణకు వచ్చే అవకాశముంది.
Read More »