తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీటీ స్కాన్ రేట్లు తగ్గాయి. రూ.2 వేలకే స్కాన్ చేసేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలు అంగీకరించాయి. సీటీ స్కాన్ కోసం రూ. 5,500 వసూలు చేయడంపై మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లను సగానికి తగ్గించాలన్నారు. అందుకు వారు ఓకే చెప్పారు.
Read More »తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా..?
తెలంగాణలో లాక్డౌన్ను కొనసాగించాలా? లేదా? అనే అంశంపై 20న కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ‘ఆస్క్ మంత్రి కేటీఆర్’ లో మంత్రి KTR ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటికే పూర్తి లాక్డౌన్ విధించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని చెప్పారు. 4 గంటలకు మించి సడలింపులు ఇచ్చే అవకాశం లేదన్నారు. అటు త్వరలోనే తానూ ప్లాస్మా దానం చేస్తానన్నారు. కరోనా వస్తే మానసికంగా దృఢంగా ఉండాలని, సొంత వైద్యం వద్దని, వ్యాయామం చేయాలని చెప్పారు.
Read More »సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం.. శాంతి, ప్రేమ, దయను పంచుతోందన్నారు. రాష్ట్రంలో గంగా జమునా తహజీబు రంజాన్ పండగ ప్రతీక అని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముస్లింల జీవితాల్లో వెలుగును నింపుతున్నాయని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Read More »సీఎం కేసీఆర్ పై షర్మిల అగ్రహం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం KCRపై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో లాక్డౌన్ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు వైఎస్ షర్మిల.. ‘అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. ఆయుష్మాన్ భారత్లో చేరరు’ అంటూ విరుచుకుపడ్డారు. సీఎం ‘KCR సారు .. సోయిలకురా. ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చు’ అంటూ వైఎస్ …
Read More »తెలంగాణలో వ్యవసాయ రంగానికి లాక్డౌన్ మినహాయింపు
తెలంగాణలో నేటి నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుండగా.. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లులకు లాక్ డౌన్ వర్తించదు. FCIకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, విత్తనాల షాపులు, సంబంధిత రవాణా, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం యథావిథిగా కొనసాగించనుంది.
Read More »తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు వీటికే…
తెలంగాణలో రేపటి నుండి లాక్డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అయితే లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు : – వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. – …
Read More »తెలంగాణలో 7ఎమ్మెల్సీలు ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటిలో 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ల పదవీ కాలం జూన్ 3న పూర్తి కానుండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16న పూర్తవుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈసీ వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అధికార టీఆర్ఎస్ ఖాతాలోని ఈ స్థానాలు తిరిగి ఆ …
Read More »మాజీ మంత్రి ఈటలకు షాక్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి,సీనియర్ నేత,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఓ వైపు మద్దతు పెరుగుతుంది. మరో వైపు ఆయనకు చెక్ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గం హుజురాబాద్లో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.. తాజాగా పలువురు అధికారులు బదిలీ అయినట్లు సమాచారం. అలాగే క్యాడర్ చేజారిపోకుండా పలువురు మంత్రులు రంగంలోకి దిగినట్లు …
Read More »పుట్ట మధు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని భీమవరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ నుంచి పుట్టా మధు కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన సతీమణి.. కొవిడ్ నుంచి కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మధు అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనేది పోలీసులు …
Read More »తెలంగాణలో రెండు వారాల్లోనే లక్షకు పైగా కేసులు
తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.
Read More »