తెలంగాణ రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »కొవిడ్ కట్టడిలో తెలంగాణ మార్గదర్శి
కొవిడ్ నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ్ కట్టడికి తెలంగాణ మార్గదర్శిగా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. మీడియాతో డీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా తగ్గిందన్నారు. ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో …
Read More »తెలంగాణలో కొత్తగా 3,892 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు మూడు వేలకు పైనే నమోదవుతున్నాయి. మరో 27 కోవిడ్-19 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 5,186 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో గడిచిన 24గంటల వ్యవధిలో 71,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 607, రంగారెడ్డి 262, ఖమ్మం 247, మేడ్చల్ 225 కరోనా కేసులు …
Read More »సీఎం కేసీఆర్ దార్శనికుడు
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎక్కడ ఏం చేపట్టాలి అన్నది సీఎం కేసీఆర్‌కు ముందే అవగాహన ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, సాగునీటితో కేసీఆర్ గారు తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మార్చారన్నారు. తెలంగాణ నవ నిర్మాణం గురించి కేసీఆర్ 2001 లోనే స్పష్టమైన ప్రణాళిక నిర్దేశించుకున్నారని, ఆకలి చావుల తెలంగాణను ఏడేళ్లలో కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారన్నారు. అత్యద్భుత పారిశ్రామిక …
Read More »తెలంగాణలో ఆక్సిజన్ కొరత రావొద్దు
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 16 …
Read More »ఈటెల ను నమ్ముకున్న వాళ్ళ … రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమేనా..?
ఈటెల ను నమ్ముకున్న వాళ్ళ … రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమే !! రాజకీయంగా ముందు చూపు లేని వాళ్ళే అలాంటి వాళ్ళ వెంట వెళతారు అసలు కేసీఆర్ కు దూరం కావడమే ఈటెల దురదృష్టం అంటున్న రాజకీయ విశ్లేషకులు కనీసం మరో పదేళ్ళపాటు టి ఆర్ ఎస్ కు తిరుగులేదనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్న మెజార్టీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ , బీజేపీ కానీ కొత్త పార్టీలు కానీ టి ఆర్ …
Read More »అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ దవాఖానలలో కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని రోగి బంధువులు …
Read More »ప్రైవేట్ ఫీజులపై పర్యవేక్షణ : మంత్రి ఎర్రబెల్లి
కరోనా నియంత్రణ కోసం, వైరస్ బారిన పడిన వారి వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను, ఆక్సిజన్‌ను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోందని చెప్పారు. కరోనా వైద్య సేవల కోసం కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసిన గ్రీన్ కో సంస్థ
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి శ్రీ కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం …
Read More »తెలంగాణలో త్వరలోనే ప్రజలందరికీ టీకాలు
సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా తయారు చేస్తున్న స్థానిక, అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తిని పెంచాలని, అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఫార్మా సంస్థల ప్రతినిధులకు నిన్నటి సమావేశంలో చెప్పారు.
Read More »