గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైంది. హైరిస్క్ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేశారు. ముందస్తుగా 30 వేల మందికి టోకెన్లు అందించగా.. 21,666 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో 44 ఏండ్లలోపు వయస్సువారు 15,963 మంది, 45 ఏండ్లు పైబడివారు 5,703 మంది ఉన్నారు. మొదటి …
Read More »రాజయ్య కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ
తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఎంఈవో మంకు రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజన్న చివరి శ్వాస వరకు విద్య కోసం పని చేశారని కొనియాడారు. ఇటీవలే ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం రోజు …
Read More »తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా 37,793 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3226 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,236 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో …
Read More »తొలగుతున్న ముసుగులు!
రాజు నిజాయితీపరుడు, నిస్వార్థపరుడైనప్పుడు ద్రోహులందరూ ఒకచోట చేరతారని చాణక్య సూక్తి. ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అని ప్రకటించుకున్న ఈటల ఆ మాట మరిచి, మాటను మార్చి కాషాయ నీడలో సేదదీరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాషాయ తీర్థం సేవించడం కోసం ఆయన బీజేపీ నాయకులతో రహస్య సమావేశాలు పెట్టుకుని, కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారట. ఒప్పందాలున్న చోట షరతులూ ఉంటాయి. మరి బీజేపీ ఏమి షరతులు విధించిందో, ఈటల షరతులేం పెట్టారో …
Read More »తెలంగాణలో 93కోట్ల చేప పిల్లల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 28 వేలకుపైగా నీటివనరుల్లో రూ.89 కోట్లతో 93 కోట్ల చేపపిల్లలు, రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలు వేయనున్నట్టు తెలిపారు. చేపపిల్లల పంపిణీపై మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. మత్య్ససంపద పెంచడంతోపాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ చేప పిల్లల పంపిణీకి …
Read More »ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు
తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.
Read More »తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికం
తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికంగా తయారైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాబోయే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయనే అంచనా ఉందన్నారు. ఇందుకుగాను 13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతున్నాయని, రాష్ట్రంలో 18.28 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. వారికి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి పంటలు సాగుచేయాలని సూచించారు.
Read More »కొవిడ్ వ్యాక్సినేషన్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, హోటల్స్, సెలూన్ల సిబ్బంది, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణదారులు, హమాలీలకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూపర్ స్ర్పెడర్లకు టీకాలు …
Read More »కరోనా కట్టడీపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో కరోనా థర్డ్ వేవు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు. బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ENTలో 250 బెడ్లు ఉన్నట్లు తెలిపారు.
Read More »లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ర్టంలో కరోనా లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌తో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్లకు …
Read More »