Home / Tag Archives: trsgovernament (page 221)

Tag Archives: trsgovernament

అందుకే TRSలో చేరుతున్న- కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాన‌ని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం మ‌ధ్యామ్నం ఒంటి గంట‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.కొండాపూర్‌లోని త‌న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, త‌న మ‌ద్ద‌తుదారుల‌ కోరిక మేర‌కు.. టీఆర్ఎస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను. …

Read More »

తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏడాది పొడ‌వునా తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగల‌కు తొలి ఏకాద‌శి ఆది పండుగ అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాల‌ను, ఆయురారోగ్యాల‌ను అందించాల‌ని సీఎం ప్రార్థించారు. రాష్ర్ట వ్యాప్తంగా వైష్ణ‌వ ఆల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. న‌దీ తీర ప్రాంతాల్లో భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Read More »

పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వేతనాన్ని ఖరారుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి, కమిషనర్‌ రఘనందన్‌రావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లించారు. పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు లబ్ధి …

Read More »

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ-ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర,ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది.  కొన్ని రోజుల క్రితం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ …

Read More »

దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్‌. రమణ

దేశంలోనే మొదటి సారిగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని టీఆర్ఎస్ నేత ఎల్. రమణ అన్నారు. ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలన్న సీఎంకేసీఆర్ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ పథకం చరిత్రలో గొప్ప మైలు రాయిగా నిలిచి పోతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా కేసీఆర్‌ తరతరాలకు …

Read More »

అభివృద్ధి పనులపై మంత్రి పువ్వాడ సమీక్ష.

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్, సుడా పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .పారిశుధ్యం, చెత్త సేకరణ, రోడ్లు, డ్రైన్స్, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులు, గుర్తించి చేయాల్సిన పనులు, మిషన్ భగీరథ, తదితర పనులపై జిల్లా కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, పంచాయతీ రాజ్, మున్సిపల్, అటవీ, విద్యుత్ తదితర శాఖ అధికారులతో సమీక్షించారు.మేయర్ …

Read More »

పేదలకు అండగా తెరాస ప్రభుత్వం – ఎమ్మెల్యే శంకర్ నాయక్

నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ గారు అన్నారు. శనివారం కేసముద్రం లోని తెరాస పార్టీ ఆఫీస్ లో కేసముద్రం మండలానికి చెందిన 08 మంది లబ్ధిదారులకు గాను రూ.2,31,000 /- (రెండు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు ) విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో కూడా …

Read More »

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మానవత్వం

తెలంగాణ  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మానవత్వం చాటుకున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు. శనివారం ఆయన ఎంపీ బండా ప్రకాశ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించి తిరిగి వస్తుండగా, ఆరెపల్లి వద్ద ఒక యువకుడు ప్రమాదంలో గాయపడి, రోడ్డు పక్కన పడి ఉండటం గమనించారు. వెంటనే …

Read More »

ఈటల రాజేందర్‌ కి షాక్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ సతీమణి జమునారెడ్డికి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. శనివారం సాయంత్రం హుజూరాబాద్‌లోని గ్యాస్‌ గోదాం ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి గతంలో తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించాడు. ఇటీవల ఈటల పంపిణీ చేసిన గోడ గడియారాన్ని నేలకేసి బాది ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఓట్లు అడిగేందుకు వస్తే తరిమికొడతానని హెచ్చరించాడు. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన టేకుమట్ల …

Read More »

టీఆర్ఎస్ లోకి చేరికలు

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరుకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో ఉన్న మంత్రి వద్దకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులు, మాజీ మార్కెట్‌ డైరెక్టర్‌, మైనారిటీ నాయకులు తదితరులు గులాబీ కండువా కప్పుకొన్నారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat