తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక …
Read More »తెలంగాణలో మరో 20 ఏండ్లు TRS పార్టీదే అధికారం
తెలంగాణ రాష్ర్టంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్‌లో అర్హులైన లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత …
Read More »గ్రేటర్ ప్రజలకు GHMC మేయర్ పిలుపు
సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మేయర్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ (040 23111-1111)కు 295 ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా కూడా సమస్యలపై …
Read More »కేసీఆర్ మరో అంబేద్కర్‌గా మిగిలిపోతారు : మాజీమంత్రి మోత్కుపల్లి
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్ అండగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ …
Read More »ఏరోస్పేస్ రంగంలో క్రియాశీల రాష్ర్టంగా తెలంగాణ : మంత్రి కేటీఆర్
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణ క్రియాశీల రాష్ర్టంగా ఆవిర్భవించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణలో టాటా బోయింగ్ 100వ అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివరీ వేడుక జరిగింది. ఇప్పటి వరకు 100 అపాచీ హెలికాప్టర్ల ప్యూజ్‌లేజ్ భాగాలను టాటా సంస్థ తయారు చేసింది. AH-64 అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివరీ కార్యక్రమంలో …
Read More »BJPకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని …
Read More »బాధపడోద్దు.. అండగా ఉంటా-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిన్న గురువారం రోజున ముంపుకు గురైన నిర్మల్ పట్టణంలోని GNR కాలనీలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. కాలనీలోని బాధితులతో మాట్లాడి ముంపు సమయంలో బాధితులు ఎదుర్కొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రకృతి విలయం …
Read More »గొల్ల, కురుమలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి …
Read More »అందరికి ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్ నిర్ణయం
పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది తన పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగతంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్‌సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా …
Read More »