తెలంగాణ రాష్ట్రంలో బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి దశల వారీగా ఉచితంగా మెడిసిన్ కిట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 20 లక్షల మంది బీపీ రోగులు, 7 లక్షల మంది షుగర్ రోగులు ఉన్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ సర్వేలో తేలింది. వీరికి ప్రభుత్వం ఇచ్చే కిట్లో నెలకు సరిపడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే బీపీ, షుగర్ మందులు ఉంటాయి. గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ …
Read More »స్టార్టప్లకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం
స్టార్టప్లకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 400 స్టార్పలు పని చేస్తున్నాయని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ప్రభుత్వం స్టార్ట్ సేవలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అదే విధంగా కంపెనీలు కూడా స్టార్టీల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు.
Read More »ఓయూలోకి రావాలంటే పైసలు కట్టాల్సిందే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఓయూలోకి ఇక నుంచి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే. స్టాఫ్, స్టూడెంట్లు మినహా మిగతా ఎవరు వచ్చినా పాస్ తీసుకోవాల్సిందేనని యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వాకర్స్ నుంచి నెలకు రూ.200, గ్రౌండ్ వాడుకునేందుకు రూ.500, జిమ్ వాడేందుకు రూ. 1,000 యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
Read More »Carona Vaccine కోసం పరుగులెడుతున్న జనాలు.. ఇందుకే..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. అయితే కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్)పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలతో ప్రజలు రిస్క్ ఎందుకని టీకా కేంద్రాలకు పరిగెత్తుతున్నారు. గత 2 రోజులుగా రెండో డోసు తీసుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు.
Read More »యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పింది
తెలంగాణ రైతాంగం పండించే యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ‘మేం ఎంతో ఆశతో వచ్చాం. కానీ కేంద్రం నిరాశ పర్చింది. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం. ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్ చెప్పమన్నాం. ఏడాదికోసారి టార్గెట్ ఇవ్వలేమని గోయల్ చెప్పారు’ అని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో TS మంత్రులు భేటీ అయిన …
Read More »6MLC లు TRS వశం
తెలంగాణలో జరుగితున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పట్నం మహేందర్రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్ నగర్), కూచికుళ్ల దామోదర్ రెడ్డి (మహబూబ్నగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Read More »క్షీరసాగర్ లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
ప్రజా ప్రయోజనార్థం గ్రామ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం, కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ …
Read More »ఆర్టీసీ ఛైర్మన్, MLA బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై టీఎస్ ఆర్టీసీ ఎండీకి లేఖ ఇచ్చారు. తనకు శాసనసభ్యుడిగా వస్తున్న జీతభత్యాలు చాలని పేర్కొన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థపై భారం మోపడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read More »LED దీపాలతో వందల కోట్లు ఆదా- మంత్రి KTR.
జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల కోట్ల నిధులు ఆదా అవుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘనత అంతా మున్సిపల్‌శాఖ బృందానిదేనని కొనియాడారు. గచ్చిబౌలిలోని పురాతన భావిని పునరుద్ధరించి పూర్వ స్థితికి తీసుకొచ్చిన అధికారులను కేటీఆర్ అభినందించారు. వెల్ డన్ అంటూ మూన్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, చిరేక్ …
Read More »MLC గా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. శ్రీనివాస్ అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయని, ఈ క్రమంలోనే నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. కవిత ఏకగ్రీవంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత మరోసారి బరిలోకి దిగిన విషయం …
Read More »