తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నాడు మధిర టౌన్ లో ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులతో కలసి జడ్పీ చైర్మన్, TRS మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు నల్లజెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. …
Read More »అర్బన్ ఫారెస్టులకు అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా తెలంగాణ అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో 109 అర్బన్ ఫారెస్టులను, హెచ్ఎండీఏ పరిధిలో 59 పార్కులను హరితహారంలో అభివృద్ధి చేశారు. తెలంగాణలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది. అర్బన్ ఫారెస్టులపై రాసిన వ్యాసం ఆ సంస్థ ఆన్ లైన్ …
Read More »తెలంగాణలో కోకాకోలా రూ. 1,000 కోట్ల పెట్టుబడులు- మంత్రి కేటీఆర్
కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని, 25 ఏండ్లుగా మంచి సేవలందిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ. 600 కోట్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం గురువారం నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. …
Read More »తెలంగాణ రైతాంగానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రికేసీఆర్ గారి చొరవతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కండ్లు మండి సరికొత్త కుట్రలకు తెరలేపింది. రైతులపై కక్ష కట్టిన …
Read More »బాలుడికి మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుణ్ కు కిడ్నీ మార్పిడి అనివార్యమని వైద్యులు సూచించారు. ఇందుకు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు …
Read More »ధాన్యం కొనేదాక బీజేపీ సర్కారుతో కొట్లాడుతాం
తెలంగాణ రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో యాసంగిలో పండించిన రైతులు పండించిన ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాగ్ పూర్ జాతీయ రహదారిపై కడ్తాల్ జంక్షన్ వద్ద రైతులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై బైటాయించి రైతులను …
Read More »తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకో
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ధర్నాలకు దిగారు. పలు చోట్ల రహదారులపై నాయకులు బైఠాయించారు. నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై నిరసన తెలుపాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే …
Read More »18 నెలల్లో వరంగల్ దవాఖాన సిద్దం..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి.రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దవాఖానను 19 ఎకరాల విస్తీర్ణంలో 27 అంతస్తులతో నిర్మించనున్నారు. రూ.1,116 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఎల్ అండీ టీ సంస్థ ఈ నెల 4న అంగీకారపత్రం (లెటర్ ఆఫ్ …
Read More »పార్లమెంటును స్తంబింపజేసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ కుటిల నీతిని ఎండగడుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటును మంగళవారం స్తంబింపజేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లోనూ తిరస్కరించటంతో వెల్‌లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని …
Read More »మంత్రి కేటీఆర్‌తో కంటోన్మెంట్ ఆర్మీ అధికారుల భేటీ.. రోడ్ల మూసివేతపై చర్చ
హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్‌తో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. మెహిదీపట్నంలోని కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించిన వరద కాల్వ వంటి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీయల్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ గారు తెలిపారు. ఇందులో భాగంగా నగరం నలుదిక్కులా …
Read More »