గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్‌భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్ కాదని.. పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన …
Read More »మంత్రులు, ఎంపీలతో కేసీఆర్ కీలక భేటీ..
రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పాలన. రాజకీయ పరమైన అంశాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకుంటున్నట్లు సమాచారం.
Read More »దాంతో తెలంగాణకు కేంద్రం పెద్ద దెబ్బ కొట్టింది: కేటీఆర్
ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ …
Read More »అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం: కేటీఆర్
తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డామని.. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అనేక పరిశ్రమలను తెచ్చుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను కేటీఆర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకమని చెప్పారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్.. ఈ …
Read More »నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా: కేటీఆర్
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు జాతీయ హోదా ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఈ ఎమిదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన.. భూత్పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్ల మార్గాల్లో రైలు కేటాయించమన్నా చేయలేదని …
Read More »మహబూబ్‌నగర్ జిల్లాలో కేటీఆర్ టూర్.. పేరూరు లిఫ్ట్‌కి శంకుస్థాపన
మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్ర, భూత్పూర్, కోసిగి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55కోట్ల వ్యయంతో చేపట్టనున్న పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వర్ని-ముత్యూలపల్లి రోడ్డుపై వంతెన, గుడిబండకు రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భూత్పూర్ చేరుకుని మున్సిపాలిటీలో మినీ స్టేడియం నిర్మాణానికి …
Read More »టీఆర్‌ఎస్ ఎంపీగా గాయత్రి రవి ప్రమాణస్వీకారం
టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సచివాలయంలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి కడియం శ్రీవారి, టీఆర్ఎస్ నేతలు గాయత్రి రవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై …
Read More »ఆరోజు నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి
రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …
Read More »మోడీ పనిచేస్తోంది దేశం కోసమా? దోస్తుల కోసమా?: బాల్క సుమన్
దేశచరిత్రలో మోడీలాంటి అసమర్థ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ఆయన నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. కరోనా సమయంలో అసమర్థ పాలనను ప్రపంచమంతా చూసిందన్నారు. తెలంగాణకు మోడీ పచ్చి వ్యతిరేకి అని సుమన్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నికయ్యారని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని …
Read More »రెండు మూడు నెలల్లోనే సంచలన వార్త వింటారు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »