తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ మీటింగ్ కు వేదిక కానున్నది. ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు డిజిటల్ మీడియా ,యానిమేషన్స్ ,వీఎఫ్ఎక్స్ ,వినోద రంగానికి సంబంధించి ఇండియాజాయ్ -2019 సదస్సు హైటెక్స్ లో జరగనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో వయాకామ్ 18,సోని పిక్చర్స్,డిస్కవరీ కమ్యూనికేషన్స్,రిలయన్స్ బిగ్ యానిమేషన్ సహా పలు దిగ్గజ సంస్థలు ఈ సదస్సులో పాల్గొనున్నాయి. …
Read More »హైదరాబాద్ కు మరో ఖ్యాతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మహానగరానికి స్థానం దక్కింది. ఎక్కడి నుంచైన సరే నగరానికి తేలికగా చేరుకోవడం.. ప్రజా రవాణా సదుపాయం ఉండటం.వలసల తాకిడి జోరు.. అందుబాటులో అందరికీ అద్దె ఇల్లులు.. మౌలిక సదుపాయలు కల్పన ,పచ్చదనం ,గాలి వంటి పలు అంశాల వారీగా ఒక సంస్థ సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ …
Read More »ఫలించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నం
సూర్యపేట కు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు.సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి …
Read More »నెరవేరనున్న పేదవాడి సొంతింటి కల
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని.. ప్రతి ఒక్కరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రంలోని పేదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనున్నది. అందులో భాగంగా మొత్తం రూ.6,992 కోట్లతో 1.35 లక్షల రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం
అమెరికాలో భారతీయ రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అమెరికా, తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం …
Read More »ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సర్కారు ఉద్యోగులకు పీఆర్సీ అమలు దిశగా చర్యలు చేపట్టింది. 10,12రోజుల్లో పీఆర్సీ అమలు గురించి నివేదికను ఇవ్వాల్సిందిగా వేతన సవరన సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగుల వేతనాల పెంపుకోసం 2018లో పీఆర్సీ కమిషన్ నియమించింది. త్వరలోనే పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. 2018 జులై 1 …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనాభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పాలనలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో విద్యారంగంలో అభివృద్ధి చెందుతున్న గిరిజనులు ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తున్న విద్యా సంస్కరణల వలన గిరిజనలు విద్య రంగంవైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలు,బెస్ట్ అవెలబుల్ స్కూళ్లు,ప్రాథమిక,మినీ ,గిరిజనుల గురుకులాలు ఇలా పలు సంస్థల ద్వారా మొత్తం …
Read More »రామప్పకు యునెస్కో గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల ఖిల్లాగా పేరు గాంచిన ఓరుగల్లు (వరంగల్)లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు దిశగా అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబర్ నెలలో యునెస్కో బృందం వరంగల్ లోని రామప్ప దేవాలయాన్ని వాళ్ళు సందర్శించారు. తాజాగా ఈ నెల ఇరవై రెండో తారీఖున ప్యారిస్ లో జరగనున్న ఇంటర్నేషనల్ మీటింగ్ కు ఆర్కియాలజీ స్టేట్ డైరెక్టర్ దినకర్ బాబు, ఇన్ కమ్ టాక్స్ …
Read More »తెలంగాణ అన్ని మున్సిపాలిటీల్లో రూ.5 కే భోజనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అమలు చేస్తోన్న రూ. 5 భోజన పథకాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తామని మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇటీవల గ్రామాల్లో చేపట్టిన ముప్పై రోజుల కార్యాచరణ సత్ఫలితాలు ఇచ్చింది. ఇదే స్ఫూర్తితో పట్టణాల్లో,నగరాల్లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ఉన్న పలు పోస్టుల …
Read More »దేవాదులకు కాళేశ్వరం జలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అప్పటి నీళ్ల మంత్రి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం . ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీళ్లు అందించనున్నది ప్రభుత్వం. తాజాగా దేవాదుల ఎత్తిపోయల పథకంలో చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »