తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయం ద్వితీయ ప్రాకారం వెలుపల సాలహారాల్లో మొత్తం 140 విగ్రహాలను అమర్చాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఏకశిలలతో సాలహార విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మంగళవారం …
Read More »రైల్వే ఉద్యోగుల కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం …
Read More »ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ మేరకు జరిగే మార్పులతో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 68 రోజులపాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుపడనుంది. ఈ 68 రోజుల్లోనే సిలబస్, రివిజన్ పూర్తిచేయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే రెండుమూడు రోజుల్లో తేదీలు ఖరారవుతాయని సమాచారం. తొలుత ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని …
Read More »ధరణి వెబ్ సైట్లో కొత్త ఆప్షన్
ధరణి వెబ్ సైట్లో కొత్త ఆప్షన్ జోడించారు పేర్లలో అక్షర దోషాలు, విస్తీర్ణ నమోదులో తేడా వ్యక్తిగత భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి వాటికోసం ‘అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్’ అనే ఆప్షన్ జతచేశారు. ఇప్పటికే నిషేధిత జాబితా, కంపెనీ భూముల రిజిస్ట్రేషన్లు మీసేవలో దరఖాస్తుకు అవకాశమిచ్చారు. అయితే ఈ కొత్త ఆప్షన్స్ అప్లై చేస్తే నేరుగా కలెక్టర్ కు చేరుతుంది. ఆయన పరిశీలించి వారంలోగా పరిష్కరిస్తారు.
Read More »బీఐఎస్ ప్రకారం మిషన్ భగీరథ నీరు
మిషన్ భగీరథ నీటితో ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తున్నది. నీటితో వచ్చే రోగాలకు అడ్డుకట్ట పడుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో గంట గంటకూ పరీక్షలు చేసి పైసా ఖర్చు లేకుండా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. తాగునీరు కొనే పనిలేకుండా ఆర్థికంగా చేదోడుగా నిలుస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23,804 ఆవాసాల్లోని 54 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా భగీరథ నీటిని అందిస్తున్నది. అదేసమయంలో మిషన్ భగీరథ …
Read More »కేంద్ర ఆర్థిక మంత్రికి మంత్రి హారీష్ సూచనలు
కేంద్ర బడ్జెట్ (2021–22) రాష్ట్రాలను ఆదుకొనేలా ఉండాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆర్థిక సంఘం సిఫారసుల అమలు నుంచి వికలాంగులకు అందించే సాయం వరకు కేంద్రం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన నిర్మలా సీతారామన్‌కు వివరించారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో …
Read More »హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
గ్రేటర్ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో రూ.4.6 కోట్లతో నిర్మించనున్న వైకుంఠదామం పనులను ప్రారంభిస్తారు. అనంతరం కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.18 కోట్లకుపైగా నిధులతో చేపట్టిన అధివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు బేగంపేటలోని ధనియాలగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం 10.10 గంటలకు ఫతేనగర్‌లో రూ. 270.50 లక్షలతో నిర్మిస్తున్న నాలా …
Read More »కవులు,రచయితలను గుర్తించిందే సీఎం కేసీఆర్
కవులు, రచయితలను గుర్తించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ఒక్కరికే దక్కుతుందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. 25 ఏండ్లలో కవులను, రచయితలను ఎవరూ గుర్తించలేదని, తన పాట, కవిత, రచనలను గుర్తించి ముఖ్యమంత్రి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని చెప్పారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట ‘బీ’ బ్లాక్ ముంతాజ్ కళాశాలలో ప్రిన్సిపాల్, కవి యాకూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2020 (షేక్ మహమ్మద్ మియా, కేఎల్ …
Read More »సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(CDS) భవనాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల
హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం (CDS) ను భవన నిర్మాణాన్ని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రూ 26 కోట్ల వ్యయంతో …
Read More »మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ ప్రశంసలు
పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను …
Read More »