వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగు విధానం, పంటల కొనుగోలు అంశాలపై చర్చిస్తున్నారు. పంటల కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో …
Read More »జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక …
Read More »మంత్రి కేటీఆర్ సీఎం కావాలని…!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ మంచిర్యాలకు చెందిన టీఆర్‌ఎస్ యూత్ విభాగం నాయకులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. శుక్రవారం అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు కాలినడక ప్రారంభించారు. కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకోసమే స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లినట్టు వారు పేర్కొన్నారు. తిరుమల వెళ్లినవారిలో టీఆర్‌ఎస్ యూత్ …
Read More »నవతరం నేత.. నవ్యతకు బాట “కేటీఆర్”
పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతికరంగాల్లో ఆయనది ఒక నవశకం. తెలంగాణ ఆధునిక విప్లవ ప్రగతి ఫలాలను అందరికి అందిస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ, పాలనానుభవం కలిగిన ఎంతోమంది పాలకుల వల్ల కానిది కేవలం ఆరేండ్ల కాలంలోనే చేసి చూపించారు. యావత్ దేశానికే ఒక మార్గదర్శిగా నిలిచిన యువనేత తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర పారిశ్రామికరంగ అభివృద్ధికి నిత్యం కృషిచేస్తూ టీఎస్- ఐపాస్, వి-పాస్, వంటి వినూత్న పథకాల …
Read More »తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం
కరోనా వ్యాప్తి తగ్గేంతవరకు OTP, ఐరిస్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగించడం ద్వారా వైరస్ ప్రబలే అవకాశముందన్న.. హైకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది ఈ విషయమై మార్గదర్శకాలు జారీచేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ కలెక్టర్లకు సూచించారు.
Read More »రాజకీయ వారసత్వం కాదు.. తెలంగాణ రాజకీయాలకు జవసత్వం ..!!
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో స్వయం పాలన ను నిలబెట్టడానికి, అభివృద్ధి పథాన నడిపించడానికి , పటిష్టమైన నాయకత్వం అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలోంచే వర్తమాన తెలంగాణలో భవిష్యత్తు నాయకత్వం రూపుదిద్దుకుంటున్నది. ఆ క్రమంలోనే, యువమంత్రి కేటీఆర్ ను సిఎం కెసిఆర్ కొడుకుగానే కాకుండా, రేపటి తరానికి నాయకుడిగా రూపుదిద్దుకుంటున్న పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వున్నది. కేటీఆర్ నేడు ఈ స్థాయికి చేరుకోవడమనేది యేదో …
Read More »సింగరేణిలో కొలువుల జాతర
తెలంగాణలోని సింగరేణిలో కొలువుల జాతర మొదలయింది. మొదటివిడుతగా 372 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలయింది. సింగరేణిలో 651 పోస్టులను మార్చిలోపల భర్తీచేస్తామని సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించిన రెండు వారాల్లోనే మొదటివిడుత భర్తీకి నోటిఫికేషన్ రావడం గమనార్హం. మిగతా పోస్టులకు దశలవారీగా నోటిఫికేషన్లను విడుదలచేస్తామని సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. తాజా నోటిఫికేషన్‌లో 7 క్యాటగిరీల్లో 372 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 305 పోస్టులను లోకల్.. అంటే …
Read More »తెలంగాణలో పది పరీక్షల నిర్వాహణపై క్లారీటీ
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి పది పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి, …
Read More »సీఎం కేసీఆర్ మరో నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా …
Read More »కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్ అంటూ పద్మారావు వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. బహుశా త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్‌కు శాసనసభ, రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు …
Read More »