మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ బీజేపీ నేతలు షాకిచ్చారు. ఇల్లందకుంట మండల బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉడుత రత్నాకర్, యువ మోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్‌తో పాటు 200 మంది బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 20 ఏళ్లుగా బీజేపీతో ఉన్నామని, ఈటల వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. …
Read More »వర్షపు నీటి నాలా అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో వర్షపు నీటి నాలా అభివృద్ధిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు విచ్చేసి జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి నాలా ఔట్ లెట్ సమస్యను పరిశీలించారు. సరైన ఔట్ లెట్ వ్యవస్థ లేని కారణంగా వర్షపు నీరు నిలిచి నిత్యం సమస్య …
Read More »CM KCR లాంటి సీఎం మాదగ్గర పుడితే బాగుండు-మహారాష్ట్ర వాసి
తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని, ఇలాంటి సీఎం తమ దగ్గర ఉంటే ఎంతో బాగుండేదని మహారాష్ట్ర వాసి రోహిలే పద్మ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్‌కు చెందిన రోహలే సదాశివ్‌కు తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో 5 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఇటీవల సదాశివ్ అనారోగ్యంతో మృతి చెందగా నామినీగా ఉన్న అతడి భార్య పద్మ అధికారులకు గత …
Read More »పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ముగిసిన సీఎం KCR సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రాధాన్య క్రమంలో పల్లెలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్లకు సీఎం నూతన కార్లను …
Read More »ఫంగస్ కు భయపడకండి ..నేనున్నా అంటున్న కిషన్ రెడ్డి
“ఫంగస్ మందు Ampoterisan ఈనెలాఖరుకి 3 లక్షలు, వచ్చేనెల మరో 3 లక్షలు వస్తాయి. మన దేశానికి చెందిన 11 కంపెనీలు ఈ ampoterisan ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా ఫంగస్ మందు అందుతుంది.వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుంది,అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలి.నిత్యావసరాల ధరలు పెరగకుండా,బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలి.జూ.డాల కోరికలు న్యాయమైనవే. జూడాలు,ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి.కరోన తగ్గినా దీర్ఘకాలిక …
Read More »కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు BRK భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీపై CS సోమేశ్కుమార్, అధికారులతో చర్చించారు. సూపర్ సైడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై చర్చలు జరిపారు. త్వరలోనే వారికి వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకునేలా చూడాలన్నారు.
Read More »TSPSC కమిషన్ నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్., సభ్యులను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ ఆమోదించారు. చైర్మన్ గా .. డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు ) … సభ్యులు గా.. రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ)., ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ .,ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ …
Read More »తెలంగాణలో కరోనా కేసుల్లేని ఏకైక గ్రామం అదే..?
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వారానికి 2 సార్లు ఊరంతా శానిటైజేషన్, శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు, ఊర్లోకి ఎవరు వచ్చినా సాయంత్రానికే వెళ్లిపోవడం వంటి పంచాయతీ తీర్మానాలతో ఆ ఊరు భద్రంగా ఉంది. సెకండ్ వేవ్లో ఒక వ్యక్తికి స్పల్ప లక్షణాలు కనబడినా టెస్ట్ …
Read More »తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు
ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలు : – మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి …
Read More »నేడు ఈటల కీలక ప్రకటన
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఇవాళ హుజూరాబాద్లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.
Read More »