Home / Tag Archives: trs governament (page 15)

Tag Archives: trs governament

స్వయం ఉపాధివైపు యువత మొగ్గు

స్వయం ఉపాధిని కోరుకునే యువతకు రాష్ట్ర ప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అభిరుచి, అనుభవం, అర్హతలున్న యువత తమ కాళ్ల మీద తా ము నిలబడేందుకు సర్కార్‌ అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వా రా అర్హులైన యువతీ, యువకుల నుంచి సబ్సిడీ రుణా ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్‌ …

Read More »

తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు

తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పంచవర్ష ప్రణాళిక నిధులను ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తోందన్నారు

Read More »

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో

దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ డెస్క్ పనిచేస్తుంది. ట్రాన్స్ జెండర్లకు ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇబ్బందులుంటే వాట్సాప్ నంబర్ 949067444కు తెలియజేయాలని సూచించారు

Read More »

కరీంనగర్ జిల్లాలో ఒకే ఊరిలో 33మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా రావడం కలకలం రేపుతోంది, రూరల్ మండలం చేగుర్తిలో 10 రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు… ఆయన అంత్యక్రియలు, కర్మకు చేగుర్తి, దుర్శేడ్, మొగ్గుంపూర్ వాసులు వచ్చారు. వీరిలో కొందరికి లక్షణాలు కనిపించడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా… 33నుందికి కరోనా వచ్చింది. దీంతో ఇవాళ కూడా గ్రామంలో కరోనా టెస్టులు చేయనున్నారు.

Read More »

ఇంటర్ ఫెయిలైన వారికి శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిలైన వారికి ఇంటర్ బోర్డు ఊరట కల్గించింది. 2020 మార్చి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరికి మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షల్లో 70% సిలబస్, 50% ఛాయిస్ వర్తింపజేశారు. ఫస్టియర్ సప్లిమెంటరీతో పాటు సెకండియర్ పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఒత్తిడికి లోను కాకుండా ఈ అవకాశం కల్పించారు. సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులను ఇప్పటికే పాస్ చేశారు

Read More »

గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు నగరాన్ని “ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020” గా ప్రకటించాయి. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా. ఆరోగ్యకరమైన సంతోషకర నగరంగా రూపొందడానికి దోహదపడ్డాయి.

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రగతి అద్భుతం

వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదలరంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో పర్యటించిన ఆయన గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతిపై సమాలోచనలు చేశారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని ఫ్లెమింగ్‌ అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా స్థానికంగా పర్యటించి, అమలవుతున్న …

Read More »

రాజస్థాన్ రాళ్లతో తెలంగాణ సచివాలయం

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్ రాళ్లను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయనుండగా రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతిని తెప్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత  అధికారులను ఆదేశించారు. భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్ వెళ్లి యంత్రాల ద్వారా చెక్కించిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించినవి పరిశీలించాలని సీఎం సూచించారు.

Read More »

హమాలీల ఛార్జీలు పెంపు

తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ పెంచిన హమాలీల ఛార్జీలు 2021 జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు

Read More »

తెలంగాణలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat