‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు. ఏది పడితే అది.. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 60 ఏండ్ల వయసు సైబడిన 11,854 మందికి మొదటి డోస్ ఇచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 5530 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ సెకండ్ డోస్ తీసుకున్నట్లు తెలిపారు, సమయం తేదీని స్వయంగా నిర్ణయించుకునే వెసులుబాటు ఇవ్వడంతో అనేక మంది స్లాట్ బుక్ చేసుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు
Read More »తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు సంబంధిత అంశాలపై సీఎం సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతురాలినే ఎన్నుకుందాం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనిలో స్థానిక నాయకుడు శ్రీకర్ గుప్త గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన టీఆర్ఎస్ …
Read More »యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి చేరుకున్నారు. నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థపతి వేలు, ఆనంద్ సాయి, యాడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ …
Read More »పల్లా రాజేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఎంపీ నామ
ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీ.ఆర్.ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం నాడు సాయంత్రం కొత్తగూడెం లోని క్లబ్ హాల్ నందు వనమా రాఘవ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారితో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు …
Read More »బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని హెచ్చరించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనవసరం అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని లేకుంటే తమ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తగిన కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపైన …
Read More »పి వి గౌరవాన్ని పెంచుదాం- మాజీ మంత్రి జోగు రామన్న
సురభి వాణి దేవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన తెలంగాణ భూమి పుత్రుడు మన మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు గారి గౌరవాన్ని పెంచుతామని మాజీ మంత్రి MLC ఎన్నికల ఇంచార్జి జోగు రామన్న అన్నారు మంచాల మండల కేంద్రంలో MLC కో ఆర్డినేటర్ ల సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్ఛేసిన జోగురామన్న గారు గ్రామాల వారిగా ఇంచార్జి లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా …
Read More »యాదాద్రి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి మధ్యాహ్నం 12.22 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వద్ద ముఖ్యమంత్రి దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం రాక సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో భారీ …
Read More »ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ గొంతుకనవుతా: ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి
ఎన్నికలప్పుడు ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా అమలుకాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులిచ్చామని చెప్పారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవి, మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సనత్‌నగర్‌లోని …
Read More »