దళిత సంక్షేమంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, నిలువనీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతీపథకం ప్రజలకు మేలు చేసిందని, ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక దళితులు పదేళ్లు వెనక్కివెళ్లిపోయారన్నారు. …
Read More »