Home / Tag Archives: tpcc (page 3)

Tag Archives: tpcc

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్‌ కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల సృష్టికి అనుమతించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్‌ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసిన …

Read More »

దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో  రాష్ట్రం అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. శానససభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కంటివెలుగు …

Read More »

మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ తమిళ సై చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు శనివారం తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ కొనసాగుతుంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు ప్రతిపక్ష నాయకులంటూ మండిపడ్డారు. …

Read More »

మోదీ నాయకత్వంలో అన్నీ హైయెస్టే..అవేంటో తెలుసా? – మంత్రి కేటీఆర్‌

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఈ దేశం గతి ఏమయిందో చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ పాలనలో మన దేశం అన్నీంటలో హైయేస్టేననన్నారు. ౩౦ ఏండ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం మోదీ నాయకత్వం వహిస్తున్న ఈ దేశంలో నమోదయిందని మంత్రి అన్నారు. ద్రవోల్బణమే కాదు 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం చేరుకుందన్నారు. ప్రపంచంలోనే …

Read More »

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభయ్యాయి. రెండో రోజైన నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరుగనుంది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలో రెండో తీర్మానాన్ని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, శాసనసభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రవేశపెట్టనున్నారు. అనంతరం టేబుల్‌ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు. రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ …

Read More »

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి? వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో సభ్యులు చర్చించి …

Read More »

కళాతపస్వి కే.విశ్వనాథ్‌ పార్థీవదేహానికి మంత్రి తలసాని నివాళులు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్‌ హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఆయన పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాళులర్పించారు. ఆయ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యావత్‌ భారతదేశంలో విశ్వనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. కళలు, సామాజిక స్పృహ ఉన్న గొప్పవ్యక్తి అని, తన సినిమాల ద్వారా ప్రజలను …

Read More »

అదానీ అంశంలో జేపీసీ విచార‌ణ చేప‌ట్టాలి : బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్‌

అదానీ సంక్షోభంపై జేపీసీ లేదా సీజేఐతో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగాలని కోరామని పార్లమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ మీడియాతో మాట్లాడారు. అదాని షేర్లు 27 శాతం పడిపోయాయని ఎంపీ కేకే చెప్పారు. షేర్ల వ్యవహారంపై …

Read More »

సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలి : మంత్రి హరీశ్‌రావు

రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన …

Read More »

ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో  టూర్ ఖరారైంది. ఈ నెల 11న కేంద్ర మంత్రి అమిత్ షా  రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat