సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాజాగా వెల్లడించింది. స్పెషల్ సాంగ్ కోసం ఓ డైరెక్టర్ తనను లో దుస్తులతో నటించమన్నాడని చెప్పింది. ‘దర్శకుడు మొదట లోదుస్తులతో నటించాలని చెప్పలేదు. కానీ సెట్ లో ఉన్నప్పుడే ఆ విషయం చెప్పాడు. కెరీర్ ఆరంభం కావడం వల్ల అతని మాటలను అడ్డు చెప్పలేకపోయా, అదే నా జీవితంలో చింతించదగ్గ విషయం’ అని పేర్కొంది..
Read More »రోజా గురించి తన వ్యాఖ్యలపై నాగబాబు క్లారిటీ
ఏపీలో నగరి వైసీపీ నటి రోజాపై మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ లో తనకు ఇష్టమైన కమెడియన్ రోజా అని ఇన్స్ట్ చిట్ చాట్ లో ఎందుకు చెప్పాడో తాజాగా వివరించాడు. ‘ ఆ ప్రశ్నకు గెటప్ శ్రీను, భాస్కర్ పేరు చెబుతానని అందరూ గెస్ చేస్తారు అందుకే రోజా పేరు చెప్పి షాకిచ్చా. ఆమె పంచులూ బాగా వేస్తారు. మా …
Read More »విభిన్న పాత్రలో అందాల రాక్షసి కాజల్
పంజాబీ సొగసరి కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్ర హీరో నాగార్జునతో తొలిసారి జోడీ కట్టబోతున్నది. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణదాస్ నారంగ్, పూస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్‌మరార్ ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘కాలేజీ రోజుల నుంచి నాగార్జునగారంటే అభిమానం. ఆయనతో …
Read More »చెన్నై భామ త్రిషకు ఘోర అవమానం
తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళంలో చెన్నై భామ త్రిషకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టే అభిమానులు ఉన్నారు. దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఆమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతుంటారు. మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన 96 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వర్కౌట్ కాలేదు కానీ తమిళనాట చరిత్ర సృష్టించింది. …
Read More »రామ్ చరణ్ నిర్మాతగా హీరోగా రవితేజ
మలయాళంలో హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్” తెలుగు రీమేక్ లో రవితేజ నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ పొందిన రామ్ చరణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో మాస్ మహారాజ్ అయితే బావుంటుంది అనుకుంటున్నాడట. ఇక మరో కీలక పాత్రలో ఎవరిని నటింపజేయాలనేది ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్నాడు
Read More »తొలిసారిగా మిల్క్ బ్యూటీ తమన్నా..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… మిల్కీ బ్యూటీ తమన్నా ‘సీటీమార్’లో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పింది. తెలంగాణ యాసలో ఈ అమ్మడు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పడం సరదాగా ఉంది. డబ్బింగ్ లో దర్శకుడు సంపత్ నంది నాకు సహాయం చేశారు’ అని పోస్ట్ చేసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో …
Read More »పెళ్లి తర్వాత రెచ్చిపోతున్న కాజల్ అగర్వాల్
టాలీవుడ్ లో మరో సినిమాకు కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ సత్తారు-అక్కినేని నాగార్జున కాంబో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ షూటింగ్ లో కాజల్ జాయిన్ కానుందట. ఈ చిత్రాన్ని శరత్ మరార్-సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.
Read More »బాలయ్యపై రోజా సెటైర్లు
ఏపీలో ఆదివారం రోజు విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో నగరి ఎమ్మెల్యే రోజా జోష్ లో ఉన్నారు.సీనియర్ నటుడు,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు వేశారు. బాలయ్య సినిమాలోని ‘తొక్కి పడేస్తా’ డైలాగ్ కు ‘వైసీపీ ఒకరికి ఎదురు వెళ్లినా.. ఒకరు వైసీపీకి ఎదురు వచ్చినా తొక్కి పడేస్తాం అంతే’ అని అన్నారు. మున్సిపాలిటీ ఛైర్మన్ సీటు కాదు కదా …
Read More »కృతిశెట్టికి బంపర్ ఆఫర్
ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే నాని, రామ్ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడుకు.. తాజాగా మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వరించినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ తో అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ సొట్టబుగ్గల సుందరిని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది
Read More »టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు కలవరం
డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉప విభాగం పోలీసులు హీరో తనీష్ తో పాటు మరో ఐదుగురికి నోటీసులిచ్చారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు అందిన వారిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శంకర గౌడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన కార్యాలయాల్లో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తనీష్ 2017లో జరిగిన డ్రగ్స్ కేసులో HYD సిట్ …
Read More »