టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగాం. స్వరమాధురి సంస్థ స్థాపించి 6,500కు పైగా కచేరీలు చేశారు. ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి పాటలను పాడారు. ‘పండంటి కాపురం’, ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లోనూ తన గాత్రంతో అలరించారు.
Read More »ఆ జాబితాలోకి చేరిన గోవా బ్యూటీ
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అని తేడాలేకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తారలంతా OTT బాట పడుతున్నారు. ఈ ప్లాట్ఫాంపై అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. తాజాగా గోవా బ్యూటి ఇలియానా ఈ జాబితాలోకి చేరింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఆమె ఓ టాక్ షో నిర్వహించనుందట.
Read More »ఆ వ్యాపారంలోని నమిత ఎంట్రీ
టాలీవుడ్ లోకి సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నమిత.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా నమిత థియేటర్ పేరుతో OTT వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘కొత్త నటీనటులు, దర్శకులతో పాటు ప్రతిభను చూపించే వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మా OTT ద్వారా చిన్న సినిమా నిర్మాతలకు సంబంధించి చిత్రాలను విడుదల చేయడానికి సాయం చేస్తాం’ అని నమిత తెలిపింది.
Read More »‘మండేలా’ రీమేక్ లో సునీల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, కమెడియన్ సునీల్.. తమిళ సినిమా తెలుగు రీమేక్లో నటించనున్నాడని తెలుస్తోంది. గత నెలలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమా నెటి ప్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ అనిల్ సుంకర.. AK ఎంటర్టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. ముందు బండ్ల గణేశ్ అనుకున్నా.. ఇప్పుడు ‘మండేలా’ …
Read More »ఆ మెగా హీరోపై మనసు పారేసుకున్న బుజ్జమ్మ
ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత కృతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉప్పెన షూటింగ్కి ముందు దర్శకుడు తనను కొన్ని సినిమాలు చూడమని కోరాడట. అన్నింటిలో కృతికి ‘రంగస్థలం’ బాగా నచ్చిందట. ఆ సినిమా చూశాక రామ్ చరణ్ అభిమానినైపోయానని చెప్పుకొచ్చింది. ఆయనతో ఓ సినిమా చేయాలనేది తన కోరిక అంటోంది కృతి.
Read More »తొలిసారిగా చైతూ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య.. తొలిసారి వెబ్ సిరీస్లో ముందుకు రానున్నాడు. చైతూ లీడ్ రోల్లో అమెజాన్ ప్రైమ్ సరికొత్త సిరీస్ రూపొందిస్తోంది. నాగచైతన్య.. తన OTT ఎంట్రీ యాక్షన్ థ్రిల్లర్తో చేయనున్నాడు. విక్రమ్ కె కుమార్.. ఈ సిరీసు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. జులైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతూతో పాటు రాధిక ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ …
Read More »విజయ్ దేవరకొండ సరసన కత్రినా కైఫ్
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సరసన నటించనున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లైగర్ పూర్తైన తర్వాత తన సినిమా ప్రకటించాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహర్ భావించాడట. అయితే, ఈ సినిమా గురించి సమాచారం ముందుగానే బయటకి వచ్చేసింది. అన్ని అనుకున్నట్లు కుదిరితే కత్రినాతో విజయ్ రొమాన్స్ చేయడం ఖాయమంటున్నాయి బీటౌన్ వర్గాలు.
Read More »దీపికా పదుకొణెకి కరోనా
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కరోనా బారినపడింది. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పుట్టింట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దీపిక కుటుంబం మొత్తానికి కరోనా సోకడం వల్ల వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆమె తండ్రి, మాజీ షట్లర్ ప్రకాశ్ పదుకొణెకు జ్వరం తగ్గకపోవడం వల్ల ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read More »11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సరికొత్త మూవీ
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 11 ఏళ్ల తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. అఫిషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. ఈ చిత్రానికి ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’లో మహేష్ పేరు అదే. ఇప్పుడదే పేరుని ఈ సినిమా టైటిల్గా ఫైనల్ చేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
Read More »హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం
కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.
Read More »