తనవంతు సాయంగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చిన రకుల్.. తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Read More »ఆ హీరో కోసం తెగ కష్టపడుతున్న పూజా
అఖిల్ అక్కినేనితో నటిస్తున్న ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో స్టాండప్ కమెడియన్గా పూజా హెగ్దే కన్పించనుంది. సన్నివేశాలకు అవసరమైనంత వరకే తన స్టాండప్ స్కిల్స్ చూపించాల్సి ఉంటుందని ఇందుకోసం చాలా హోంవర్క్ చేశానని చెప్పింది. మరే సినిమా కోసం ఈ స్థాయిలో హోంవర్క్ చేసి శ్రమించలేదని పూజా వెల్లడించింది. జీఎ2 బ్యానర్పై బన్నీ వాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు.
Read More »కియారా అద్వానీ తెగ బిజీ
కరోనా బారిన పడి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సైన్ చేసిన ఈ అమ్మడు.. తన డేట్స్ కూడా కేటాయించిందట. ప్రస్తుతం ఆచార్య మూవీతో కొరటాల శివ బిజీగా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్తో మూవీని …
Read More »రాశీ ఖన్నా సంచలన నిర్ణయం
కరోనా కష్టకాలంలో హీరోయిన్ రాశీఖన్నా తనకు సాధ్యమైనంత వరకూ అనాథల ఆకలి తీరుస్తోంది. ముంబైలో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సాయం చేస్తోందట. అయితే ఎలాంటి ప్రచారం లేకుండానే ఆమె.. సైలెంట్గా అన్నార్థులను ఆదుకుంటోందట.
Read More »జర్నలిస్టు TNR కి అండగా చిరు
ప్రముఖ నటుడు,యాంకర్ జర్నలిస్ట్ TNR మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. TNR భార్యా పిల్లలను ఫోన్లో పరామర్శించారు చిరు.. తక్షణ ఖర్చుల కోసం రూ.లక్ష సాయం చేశారు. ‘TNR ఇంటర్వ్యూలను ఎన్నో చూశా. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది. పట్టుదలతో ఎదిగిన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎలాంటి అవసరం వచ్చినా మీ కుటుంబానికి నేనుంటా’ అని చిరు చెప్పారు. అటు హీరో సంపూర్ణేష్ బాబు …
Read More »కరోనా ఎఫెక్ట్ – మహేష్ బాబు పిలుపు
కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హీరో మహేశ్ బాబు సూచించారు. ‘కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించండి. అవసరమైతేనే బయటకు రండి. కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో చూసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీంతో అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని మహేశ్ ట్వీట్ చేశారు.
Read More »పెళ్ళిపై ఛార్మీ క్లారిటీ
తాను పెళ్ళికి సిద్ధమయ్యాయని వచ్చిన వార్తలను హీరోయిన్, నిర్మాత ఛార్మి ఖండించింది. “ఇప్పుడు నా జీవితంలో మంచి దశలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో పెళ్లి చేసుకునే తప్పును నేను ఎప్పటికీ చేయను” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్తో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. ఛార్మి ప్రస్తుతం పూరి కనెక్ట్ సహనిర్మాతగా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటోంది.
Read More »కంగనా రనౌత్ కి కరోనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.
Read More »లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ప్రభాస్ మూవీ
‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం లేడీ డైరెక్టర్ సుధా కొంగర… డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా సుధా.. ప్రభాస్కు ఒక సోషల్ డ్రామా కథ చెప్పారట. స్టోరీ లైన్కు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడు.. బౌండ్ స్క్రిప్ట్ విన్న తరువాత సుధా ప్రాజెక్ట్ పై తుది నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ 2023 వరకు ఇప్పటికే ఓకే చెప్పిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో …
Read More »గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యువరత్ననందమూరి బాలకృష్ణ.. ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించిన ‘క్రాక్’ గోపీచంద్ మలినేనితో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల సక్సెస్తో జోష్ మీదున్న అందాల భామ శృతిహాసన్.. బాలయ్యతో జోడీ కట్టనుందట. ఇప్పటికే సలార్ లాంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉంది శృతి. బాలయ్య మూవీకి …
Read More »