దక్షిణ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కీర్తి సురేష్ క్రేజీ హీరోయిన్గా కొనసాగుతోంది. ఈ కేరళ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కీర్తి.. సూపర్ స్టార్ సినిమాలో సోదరి పాత్రకు ఓకే చెప్పిందట. రజినీకాంత్ హీరోగా శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ‘అన్నాతే’. ఈ సినిమాలో కీర్తి.. రజినీ చెల్లెలిగా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల తన షెడ్యూల్ని కూడా పూర్తి చేసుకుంది. మరోవైపు మహేశ్ ‘సర్కారువారి పాట’లో నటిస్తోంది.
Read More »ఆనందయ్య మందుపై జగ్గుభాయ్ సంచలన ట్వీటు
అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య మందుపై సినీ నటులు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.. తాజాగా నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రకృతి మనల్ని కాపాడేందుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు అన్ని అనుమతులను పొంది, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆయనను ఆశీర్వదించాలి.’ అని జగ్గుభాయ్ ట్వీట్ చేశాడు.
Read More »సరికొత్త పాత్రలో దీపికా
ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ – హీరోయిన్ దీపికా పదుకొణె కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో బందిపోటు రూపమతి పాత్రలో దీపిక నటించనుందని, దీనికి ‘బైజు బావ్రా’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 2022 ద్వితీయార్థంలో ఈ సినిమా ట్రాక్ ఎక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి.
Read More »సమంత అందుకే అది చేయలేదంట
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీల్లో మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నా.. ఒక్క హిందీ సినిమాలో కూడా నటించని ఆమె, ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్లో నటించింది. ఇన్నాళ్లూ హిందీ సినిమాలకు ఎందుకు సైన్ చేయలేదన్న ప్రశ్నకు స్పందించిన ఆమె.. ‘ఏమో భయం అయ్యిండొచ్చు’ అని బదులిచ్చింది. అటు ఇకపై బాలీవుడ్ …
Read More »నాపై అవన్నీ పుఖార్లే
ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తగ్గిన వెంటనే నాగార్జున ‘బంగార్రాజు’ ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పాయల్.. ‘అవన్నీ పుకార్లే. నేను ఎలాంటి ఐటెంసాంగ్ చేయడం లేదు’ అని తెలిపింది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read More »మెగాస్టార్ తొలి అడుగు
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో… మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నిన్న సోమవారం ప్రారంభమైంది. కర్ణాటక చింతామణి ప్రాంతంలో దాన్ని ఓపెన్ చేశారు. అఖిల భారత చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ దాన్ని ప్రారంభించగా.. మెగాస్టార్ చిరు స్వయంగా అతడికి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ లను నెలకొల్పనున్నారు.
Read More »రష్మిక పిలుపు
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ధైర్యంగా ఉండాలని హీరోయిన్ రష్మిక ఓ వీడియో ట్వీట్ చేసింది. ‘ రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా సవాల్ విసురుతోంది. ఈ సమయంలో మనం సానుకూలంగా ఆలోచించాలి. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. ప్రజల్లో ధైర్యం నింపడానికి వచ్చే వారం నుంచి మన పరిసరాల్లోని కొవిడ్ హీరోలను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మీ ముఖాల్లో చిరునవ్వు కోసం ఈ చిన్ని ప్రయత్నం’ అని …
Read More »సాయం చేయండి-శృతి హసన్ పిలుపు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, ఇలాంటి వారిని తమకు తోచిన విధంగా ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని హీరోయిన్ శృతిహాసన్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘లాభం’ చిత్రంలో నటించింది. అలాగే, తెలుగు, కన్నడ భాషల్లో కూడా మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే, లాక్‌డౌన్ కారణంగా సినిమాల షూటింగులన్నీ ఆగిపోవడంతో ప్రస్తుతం ముంబైలోని తన సొంతింటిలో ప్రియుడితో …
Read More »హీరోగా బాలనటుడు
బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన సాత్విక్ వర్మ హీరోగా మారాడు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ‘బ్యాచ్’లో అతను హీరోగా నటించాడు. దర్శకుడు శివ మాట్లాడుతూ ‘‘ఇదొక యూత్‌ఫుల్ కాలేజీ ఎంటర్‌టైనర్. పోకిరీ కుర్రాళ్లు క్రికెట్ బెట్టింగ్‌లో ఏం చేశారన్నది కథ’’ అని చెప్పారు. ‘‘చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా. త్వరలో విడుదల చేస్తాం’’ అని నిర్మాత రమేశ్ ఘనమజ్జి …
Read More »కంటతడిపెట్టిన సోను సూద్
కరోనా బాధితుల పాలిట ఆపద్బాంధవుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో కంటతడిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బ్రతికుండి బెడ్లు, ఆక్సిజన్ కోసం పోరాడుతుంటే తాను తట్టుకోలేకపోయేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు. కాగా సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి సాయం చేసేవారు. ఇక సోనూ తల్లి సరోజ్ పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్యంతో కొంతకాలం క్రితం వారు కన్నుమూశారు.
Read More »