తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో క్రేజీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఓ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్ పిన్ని పాత్ర అని …
Read More »పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం
దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ (భార్య అశ్విని తండ్రి) రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యం బారినపడ్డారు. ఈక్రమంలోనే గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. పునీత్ కూడా గుండెపోటుతోనే మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త, తండ్రిని కోల్పోయిన అశ్విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Read More »త్వరలో ప్రకాశ్ పదుకొణె బయోపిక్
త్వరలోనే తన తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె బయోపిక్ తీస్తున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రకటించింది. ‘భారత్లో క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన వ్యక్తుల్లో మా నాన్న ఒకరు. 1981లోనే ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఇప్పుడున్నంత అధునాతన సౌకర్యాలు లేకపోయినప్పటికీ తను ఒక్కో మెట్టూ ఎదిగారు.’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Read More »బోయపాటి శీను కాంబినేషన్లో హీరో రామ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో..ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తాను బోయపాటితో సినిమా చేయనున్నట్లు రామ్ ట్వీట్ చేశాడు. ఇది తన 20వ సినిమా అని.. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన బోయపాటితో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.
Read More »నిర్మాతలకు షాకిచ్చిన అమలాపాల్
కోలీవుడ్ నటి అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్గా అమలాపాల్ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. అయితే అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారని సమాచారం. దీంతో అమలాపాల్, నాగ్ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే టాక్ నడుస్తోంది.
Read More »రాజ్యసభ సీటుపై ఆలీ క్లారిటీ
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేత,ప్రముఖ నటుడు అలీ కుటుంబ సమేతంగా ని సీఎం ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎంతో జరిగిన భేటీ వివరాలను అలీ వెల్లడించారు. ‘మర్యాదపూర్వకంగా మాత్రమే సీఎంను కలిశా. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. సమయం లేక నేనే వద్దని చెప్పా. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాను. పదవి ఇస్తేనే పార్టీలో సేవ చేస్తానని …
Read More »మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూత
ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయుడిలో జన్మించిన ఆయన.. ఎన్నో భాషల్లో పాటలు పాడారు. తెలుగులోనూ చాలా సినిమాల్లో పాటలు పాడిన బప్పి లహిరి.. సింహాసనం, స్టేట్ డీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు.
Read More »లక్కీ ఛాన్స్ కొట్టిన యంగ్ బ్యూటీ
రొమాంటిక్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది యంగ్ బ్యూటీ కేతిక శర్మ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్లాప్ సినిమాల లిస్ట్లో చేరింది. అనంతరం వచ్చిన లక్ష్య మూవీ ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. ఈ ముద్దుగుమ్మ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ మీదే ఆశలు పెట్టుకుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గిరీషాయ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మే 27న రిలీజ్ …
Read More »Mahesh అభిమానులకు Good News
Tollywood దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేశ్ బాబు నటించే సినిమా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ను జక్కన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా మహేశ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కాగానే.. రాజమౌళి టీమ్.. మహేశ్ చిత్రానికి సంబంధించిన ప్రీ …
Read More »ఓటీటీలోకి మెగాపవర్ స్టార్
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చేనెల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఆపై నెల్లో మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేశాడు. ఇందులో చెర్రీ సిద్ధగా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరిగా శంకర్ దర్వకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక …
Read More »