నూతన సంవత్సరం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంపరాఫర్ ప్రకటించింది. రేపు శ్రీవారిని దర్శించుకునే వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు అదనంగా లడ్డూలు కావాలంటే ఎలాంటి సిఫార్స్ లేఖలు లేకుండానే కౌంటర్‌లోనే కావల్సిన లడ్డూలు కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా టీటీడీ ఇక నుంచి నెలకు …
Read More »తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు…!
చెన్నైలో తిరుపతి తిరుక్కుడై ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్లు ఈ తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఈ రోజు ఉదయం జరిగిన సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామిజీలు స్వయంగా గొడుగులకు హారతులిచ్చి గరుడసేవకు …
Read More »తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం…!
తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా టీటీడీ అధికారులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీహరి మూలవిరాట్టును పట్టుపరదాతో పూర్తిగా కప్పివేసి, ఆనంద నిలయం, బంగారువాకిలి, …
Read More »ఆ విషయంలో తెలుగు తమ్ముళ్లపై మాజీ సీఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు…!
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తయింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈ టీటీడీ బోర్టులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ మేరకు 29 మందితో కూడిన టీటీడీ బోర్డు కొలువుదీరనుంది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీయస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ కొత్త టీటీడీ బోర్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈవోగా ఉన్నప్పుడు 14 …
Read More »తిరుమలలో వయో వృద్ధులకు ఉచిత దర్శనం..సమయాలు ఇవే..!
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పించే ఎల్1, ఎల్2, ఎల్3 లను రద్దు చేశారు. దేవుడి ముందు అందరూ సమానమే అని ప్రకటించారు. తాజాగా తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి …
Read More »వైసీపీ ఎమ్మెల్యే భూమన సంచలన నిర్ణయం..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ కంచుకోట అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున నిలబడి గెలుపొందిన ఎమ్మెల్యే,టీటీడీ మాజీ చైర్మన్,వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపో మాపో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి వర్గంలో తన స్థానం గురించి భూమన స్పందించారు. ఆయన మీడియాతో …
Read More »ప్రత్యేక హోదా కోసం, నిధుల కోసం నీతి ఆయోగ్ లో సీఎం చర్చ.. వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆరోజున తిరుపతికి వస్తుండటంతో ప్రధానికి స్వాగతం పలకడంతో పాటు సీఎం ఆయనతే భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజనహామీలు అమలు చేయాలని ప్రధానిని జగన్‌ను కోరనున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం సీఎం ఈనెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రత్యేకహోదాతో పాటు …
Read More »2019ఎన్నికల్లో వైసీపీకి నా మద్ధతు -జనసేన అధినేత పవన్..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు .ఇదే విషయం గురించి ఇటివల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తన ఎంపీ పదవికి రాజీనామా …
Read More »బండారం బయటపడుతుందనే..తిరుపతి సభలో బాబు దాచిపెట్టిన అసలు వీడియోలు ఏంటో తెలుసా?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు బుక్ అయిపోయారు. ఈ దఫా పార్టీ నేతల దృష్టిలోనే ఆయన చులకన అయిపోయారని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి అట్టహాసంగా సభ పెట్టుకుంటే.,.అది కాస్త తనకే కౌంటర్ అయిందని మథనపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభ గురించే ఈ చర్చ అంతా. అందులోనూ బాబు దాచిపెట్టిన వీడియోల గురించే ఈ కామెంట్లన్నీ. ధర్మపోరాట …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 64,801 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,634 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.29 కోట్లుగా ఉంది అని అధికారులు …
Read More »