చిత్తూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి ప్రజలు ఆలోచించడమే మానేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో, ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాదని వ్యాఖ్యానించార. చిత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో అభిమానించే ప్రధాని మోడీ.. పవన్‌ను పక్కన పెట్టారని చెప్పారు. రౌడీయిజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తన చూసే ప్రధాని దూరం పెట్టేశారని రోజా …
Read More »తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు వెల్లడి.. ఎంతో తెలిస్తే షాక్!
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మొత్తం ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించింది టీటీడీ దేవస్థానం. 1933 తర్వాత ఇప్పుడు వెంకన్న ఆస్తులు వివరాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది టీటీడీ దేవస్థానం. బంగారం డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, నగదు, భూములు రూపంలో శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయంటే.. దేశంలోనే ముఖ్యమైన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, డబ్బు …
Read More »బాణసంచా షాపులో భారీ అగ్నిప్రమాదం!
తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని నారాయణదాసు తోటలో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా పెద్దగా ఏర్పాటు చేసిన దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సంబంధిత దుకాణంలో శనివారం రాత్రి క్రేకర్స్ అమ్ముతుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడున్నవారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో దాదాపు రూ.20 లక్షల విలువ చేసే టపాసులు పేలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా …
Read More »ఆ 2 రోజులు గ్రహణాలు.. శ్రీవారి ఆలయం క్లోజ్
త్వరలో రెండు గ్రహణాలు రానున్నాయి. ఒకటి సూర్య గ్రహణం, రెండోది చంద్ర గ్రహణం. వీటి కారణంగా ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి దేవాలయాన్ని సంపూర్ణంగా మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది. గ్రహణం రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. ఈ నెల 25న సూర్యగ్రహణం, వచ్చే నెల నవంబరు 8న చంద్ర గ్రహణం ఏర్పడతాయి. సూర్యగ్రహణం రోజున ఉదయం 8.11 గంటల …
Read More »వెంకన్నను సన్నిధిలో ముకేశ్ అంబానీ.. శ్రీవారికి భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు …
Read More »తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. అందుబాటులో స్పెషల్ ట్రైన్
తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి కానుకగా ఆగష్టు 31, సెప్టెంబరు 1(రేపు, ఎల్లుండి) రెండు ప్రత్యేక రైళ్లను తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఈ స్పషల్ ట్రైన్లు సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య తిరగనున్నాయని రైల్యే శాఖ పేర్కొంది. టైమింగ్స్ ఇవే.. స్పెషల్ ట్రైన్ నెం. 07120 రేపు ఆగష్టు 31న సాయంత్రం 6.15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి …
Read More »మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్‌కి 2019లో యాక్సిడెంట్ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …
Read More »వాళ్లే టెన్త్ పేపర్లు లీక్ చేశారు: సీఎం జగన్
వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే టెన్త్ పరీక్షల పేపర్లను లీక్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. టీడీపీకి మాజీ మంత్రి నారాయణకు చెందిన శ్రీ చైతన్య, నారాయణ స్కూల్స్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయన్నారు. తిరుపతిలో జగనన్న విద్యాదీవెన నిధులను సీఎం విడుదల చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని.. ఇప్పుడు తాము ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని …
Read More »ముంబయిలో శ్రీవారి ఆలయానికి రూ.500కోట్ల స్థలం..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. నడక దారి భక్తులకి దివ్యదర్శనం టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం, పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల …
Read More »తిరుమల ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు
తిరుమల ఘాట్ రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కొండపైకి వెళ్తున్న టీటీడీ ధర్మరథం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగువ ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ధర్మరథం బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి బస్సును లింక్ రోడ్డులో ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మంటలు చెలరేగినపుడు బస్సులో భక్తులెవరూ లేరు. బస్సు ఇంజిన్‌లో …
Read More »