తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మొత్తం ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించింది టీటీడీ దేవస్థానం. 1933 తర్వాత ఇప్పుడు వెంకన్న ఆస్తులు వివరాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది టీటీడీ దేవస్థానం. బంగారం డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, నగదు, భూములు రూపంలో శ్రీవారి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయంటే.. దేశంలోనే ముఖ్యమైన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, డబ్బు …
Read More »వెంకన్నను సన్నిధిలో ముకేశ్ అంబానీ.. శ్రీవారికి భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు …
Read More »తిరుమలకు భారీగా భక్తులు.. 30 కంపార్ట్‌మెంట్లు ఫుల్
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను కూడా టీటీడీ అనుమతిస్తుండటంతో పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు సర్వదర్శనం టోకెన్లు లేని సుమారు 17వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలోనూ క్యూలైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తయ్యేందుకు సుమారు 10 నుంచి 15 …
Read More »టీటీడీ అన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్‌లైన్‌లో విడుదల చేసింది. తొలిసారిగా ఉచిత దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. టీటీడీ ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్ నెల కోటా సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నది. కాగా, …
Read More »ఎస్వీబీసీ ద్వారా అన్నమయ్య సంకీర్తనల విస్తృత ప్రచారం
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రియ భక్తుడు శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు స్వామి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన ఇందుకు సంబంధించిన ప్రోమో లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించేందుకు ” …
Read More »టీటీడీ పాలక మండలి జాబితా విడుదల
టీటీడీ కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం నియమించింది. 25 మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, …
Read More »గురువారం తిరుపతికి సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్లను పదివేల నుంచి 20 వేలకు పెంచింది. ఎక్కువ మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు. భూదేవి కాంప్లెక్స్ లోనూ ఈ టోకెన్లను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లను పెంచటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read More »