అల్వాల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. …
Read More »తెలంగాణ వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం
గత ఎనిమిదేండ్లుగా సంక్షేమాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం తాజాగా వైద్యరంగంలో నెంబర్ వన్ గా నిలవడానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కరోనా లాంటి మహమ్మారిని కట్టడీలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అల్వాల్ (బొల్లారం), సనత్‌నగర్ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), …
Read More »హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్)లో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం రూ.2,679 కోట్లతో ఎల్బీనగర్ (రూ.900 కోట్లు), సనత్ నగర్ (రూ.882 కోట్లు), అల్వాల్ (రూ.897)లో ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక టిమ్స్ ఉండగా.. కొత్తవాటితో HYDకు నలువైపులా నాలుగు టిమ్స్ు అందుబాటులోకి రానున్నాయి.
Read More »టిమ్స్‌లో 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గచ్చిబౌలి టిమ్స్‌ను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించారు. అనంతరం కరోనా వార్డులను కేటీఆర్ కలియతిరిగారు. కరోనా బాధితులను పరామర్శించి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 1200 బెడ్స్‌తో కరోనా రోగులకు సేవలు అందుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన 150 పడకలను …
Read More »