తెలంగాణ రాష్ట్ర రాజధానిమహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. గోల్కొండ కోటలో వెయ్యి మందికి పైగా కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ సందేశం ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. గోల్కొండ కోటకు చేరుకునే ముందు ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ అమర జవానుల …
Read More »తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోంది.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భం ఇది. ఈ చారిత్రక సంబంధాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా …
Read More »రేపు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లో ట్రాఫిక్ బంద్.. ఎందుకంటే..?
స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడానికి పోలీసుశాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు …
Read More »‘ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి జంక్షన్ నుండి పేట్ బషీరాబాద్ వరకు నిర్వహించిన 2K రన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ వివిఎస్ …
Read More »తెలంగాణ ఉద్యమానికి భారత జాతీయ ఉద్యమమే ప్రేరణ
భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో మంత్రి ఫ్రీడం రన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ …
Read More »స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలి
అఖంఢ భారత స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో పేదరికం అంతరించిపోవాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. గతంలో జరిగిన సమావేశాల్లో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిన్న బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 …
Read More »కాంగ్రెస్ లో కొత్త రగడకు తెరలేపిన మునుగోడు ఉప ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో …
Read More »కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. వంద శాతం సాధించినట్లు మండల విద్యాధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడు బాసర ఐఐటీలో …
Read More »TSRTC ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్
తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆఫర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ అనుభవాలను చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వారు పంపిన అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న అనుభవాలను పంపిన వారికి టీఎస్ఆర్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారని వీసీ సజ్జనార్ చెప్పారు. సో మీరు ట్రై చేయండి అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
Read More »