ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు. వారి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం …
Read More »వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటాం – మంత్రి హరీష్ రావు
బుధవారం ఉదయం వనజీవి రామయ్య.. ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్ వచ్చి ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన కాలికి గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ …
Read More »ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, …
Read More »TRSలో చేరిన BJP నేతలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …
Read More »సీసీఐ పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోండి-కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు
Read More »పిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి-మంత్రి హరీశ్‌రావు
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ 9వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను వైద్యారోగ్యశాఖ మంత్రి తాజ్ డెక్కన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే …
Read More »అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు
దేశంలోనే అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,793 మత్స్య సొసైటీలు ఉండగా, కొత్తగా మరో 1,177 సొసైటీలు ఏర్పాటుచేస్తున్నారు. దీంతో మొత్తం సొసైటీల సంఖ్య 5,970కి పెరగనున్నది. మత్స్య సంపదకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో 3,315 సొసైటీలు ఉండగా ఏపీలో 2,347 సొసైటీలు ఉన్నాయి. రాష్ట్రంలోని మత్స్య సొసైటీల్లో దాదాపు 3.75 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఉచిత …
Read More »టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజకు అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా మహిళా జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినందుకు శ్రీజను, అలాగే కోచ్ సోమనాథ్ ఘోష్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, సామగ్రి సహా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడల్లో తెలంగాణకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నది.
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త-త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు
తెలంగాణలో వైద్యారోగ్య వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ …
Read More »టీ – డయాగ్నోస్టిక్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగిలో టీ – డయాగ్నోస్టిక్ హబ్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. టీ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఆవిష్కరించారు. వైద్య పరీక్షల వివరాలను మొబైల్ యాప్‌లోనే తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో విప్లవాత్మకమైన చర్యలకు సీఎం కేసీఆర్ శ్రీకారం …
Read More »