ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగాకోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం వారు గడ్కరీతో సమావేశమై తమ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా …
Read More »మాజీ ఎంపీ పొంగులేటికి మంత్రి పువ్వాడ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దమ్ముంటే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి అని పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల …
Read More »సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ప్రతి నెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26వేల పాఠశాలల్లోని 54,201 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. అయితే, కొత్త వేతనం అమలు ఎప్పటినుంచి అనేది …
Read More »మహారాష్ట్ర లో బి.ఆర్.ఎస్ కు అంకురార్పణ
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతల సమక్షంలో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ అదే దూకుడుతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నది. ఇటీవల ఒడిశా మాజీ ముఖ్యమంత్రి …
Read More »నేడే తెలంగాణ మంత్రివర్గం భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు ఆదివారం సమావేశమవనుంది. ఈ సమావేశంలో భాగంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీకానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు ఈ నెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై మంత్రివర్గం చర్చించి, ఆమోదం తెలుపనున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సృష్టికి అనుమతించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసిన …
Read More »దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. శానససభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కంటివెలుగు …
Read More »మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళ సై చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు శనివారం తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ కొనసాగుతుంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు ప్రతిపక్ష నాయకులంటూ మండిపడ్డారు. …
Read More »మోదీ నాయకత్వంలో అన్నీ హైయెస్టే..అవేంటో తెలుసా? – మంత్రి కేటీఆర్
ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఈ దేశం గతి ఏమయిందో చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ పాలనలో మన దేశం అన్నీంటలో హైయేస్టేననన్నారు. ౩౦ ఏండ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం మోదీ నాయకత్వం వహిస్తున్న ఈ దేశంలో నమోదయిందని మంత్రి అన్నారు. ద్రవోల్బణమే కాదు 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం చేరుకుందన్నారు. ప్రపంచంలోనే …
Read More »ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. రెండో రోజైన నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరుగనుంది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలో రెండో తీర్మానాన్ని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, శాసనసభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రవేశపెట్టనున్నారు. అనంతరం టేబుల్ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ …
Read More »