తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.దివంగ ఎమ్మెల్యే సాయన్న.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగారని, శాసన సభ్యుడిగా.. ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముందన్నారు. …
Read More »అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం ద్వేయం
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముస్లిం మైనార్టీ సోదరులకు గ్రేవ్ యార్డ్ కొరకు సర్వేనెంబర్ 186 బాచుపల్లిలో గల రెండు ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినందుకు గాను ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర …
Read More »సత్తుపల్లిలో ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు.
19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు ఆగస్టు నేటి నుంచి పున: ప్రారంభించి, సెప్టెంబర్ రెండో వారం కల్లా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలు పట్ల హర్షిస్తూ సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ గారి బొమ్మ వద్ద సత్తుపల్లి రూరల్, టౌన్ మండల రైతులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రైతు రుణమాఫీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫ్లెక్సీ కి …
Read More »రేపటి నుంచే మద్యం టెండర్ల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం గురువారం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. …
Read More »గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు
తెలంగాణలో గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. దళితబంధు, కల్యాణలక్ష్మి, సబ్సిడీ రుణాలు తదితర పథకాలన్నింటిలోనూ దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలవుతున్నది. తాజాగా గృహలక్ష్మి పథకంలోనూ 5% రిజర్వేషన్‌ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ …
Read More »ఆరోగ్య బీమాలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ
ప్రజలకు సొంతంగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ కంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న’ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారానే ఎక్కువ మంది సేవలు పొందుతున్నట్టు స్వయంగా నరేంద్రమోదీ సర్కారే స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీమాకు అర్హత కలిగిన 68% కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలు అందుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ పథకం కేవలం 32% కుటుంబాలకే …
Read More »తెలంగాణలో ఈ సీజన్ లో 25 లక్షల ఎకరాల్లో వరి సాగు
తెలంగాణలో ఈ సీజన్‌లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైం ది. అంటే ఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు కావడం గమనార్హం. గత వానకాలంలో రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో …
Read More »రైతులకు గుడ్‌న్యూస్
తెలంగాణలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పునః ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం.. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనాతో సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం …
Read More »అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే వనమా దూరం
ఈరోజు గురువారం నుండి మొదలవుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల తనను అనర్హుడ్ని ప్రకటించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కల్సి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలి.. అందుకు సంబంధించిన హైకోర్టు ఉత్తర్వుల కాపీని ఆయనకు …
Read More »ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఉద్యోగులు సంబరాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్‌టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, దీని వల్ల 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం నిర్మల్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు …
Read More »