తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్నవి. మంగళవారం నాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ …
Read More »రేపు సిద్దిపేటకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. వర్గల్ నవోదయ వద్ద కాల్వలోకి సీఎం నీటిని వదలనున్నారు. సంగారెడ్డి కాల్వకు నీటి విడుదలపై స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More »జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ర్టంలోని జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. సెక్రటరీల పట్ల మరోసారి సీఎం కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యులర్ జీతాలు ఇస్తామన్నారు.శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కడుపులు నింపినోళ్లం.. కడుపు కొట్టినోళ్లం కాదు.. పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా చేయడం వల్లే గ్రామాలు బాగు చెందుతున్నాయి. హరితహారంలో నాటిన …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభించనున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ …
Read More »ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్-మంత్రి హరీశ్ రావు.
ఉద్యోగుల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ప్రభుత్వం తమదని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్ మెంట్ ను ఇస్తూ పీఆర్సీపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పీఆర్పీని ఆహ్వానిస్తూ అరణ్య భవన్ లో ఉద్యోగుల సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ పక్షపాతి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది గల వ్యక్తని చెప్పారు. ప్రభుత్వ …
Read More »గోదావరి జలాలు.. విడుదల చేసిన మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోని 11వేల ఎకరాలకు …
Read More »సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా గోదావరి జలాలు కూడవెళ్లి వాగులోకి వస్తాయని ఎవరూ భావించలేదని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కూడవెళ్లి వాగుకు నీటిని విడుదల చేసి హరీశ్.. జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ.. ‘‘కూడవెళ్లి వాగుకు ఇవాళ 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. గతంలో గుక్కెడు నీటి కోసం ఘోష పడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం పుష్కలంగా తాగునీటితో పాటు సాగునీరు సరఫరా అవుతోంది. …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ జరగనుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ నెల 18న మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Read More »తెలంగాణలో త్వరలోనే సమగ్ర భూ సర్వే
త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్‌లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వే జరపాలని ప్రభుత్వం గత సంవత్సరం నిర్ణయిచింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్‌బుక్‌లు అందించనున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణకు ఎంత …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22- రైతుల రుణాలు మాఫీకి 5,225 కోట్లు
గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రుణాలను మాఫీ చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. త్వరలోనే ఈ రుణాలను మాఫీ …
Read More »