తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం మంత్రి హరీశ్‌రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకుడు మందుల రాఘవారెడ్డి తల్లి నర్సవ్వ మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ఓదార్చారు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆ కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు. …
Read More »రైతుబంధు సాయం రైతుకే ఇవ్వాలి-బ్యాంకర్లకు మంత్రి హారీష్ ఆదేశం
తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బాకీల కింద జమచేసుకోకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. వానకాలం సాగుకు పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే, కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కేభవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో …
Read More »టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత ముద్దసాని కశ్యప్‌రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కశ్యప్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. త్వరలో హుజురాబాద్‌లో జరిగే సభలో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పారు. హుజురాబాద్ …
Read More »రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ
తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదును జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదికి మొత్తం 63,25,695 మందిని అర్హులుగా గుర్తించామని వివరించారు. కొత్తగా 66,311 ఎకరాలకు రైతుబంధు వర్తింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. 150.18 లక్షల ఎకరాలకు రూ.7,508.78 కోట్లు అవసరమని చెప్పారు. గతేడాది రెండు సీజన్లకు కలిపి రూ.14,656.02 కోట్లు పంపిణీ చేయగా.. …
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి
కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి కి చర్యలు చేపట్టాలి. కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు. 44 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ################# దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు …
Read More »జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు …
Read More »మంత్రి హారీష్ అధ్యక్షతన వైద్యారోగ్య సబ్ కమిటీ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్‌కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్‌రావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, పీ సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు, పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి సమగ్ర …
Read More »తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్ కీలక నిర్ణయాలు ….. రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి …
Read More »అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాలాజీ ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం సిద్దిపేట జిల్లాలో హై రిస్క్ లకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్: – వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. …
Read More »కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు BRK భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీపై CS సోమేశ్కుమార్, అధికారులతో చర్చించారు. సూపర్ సైడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై చర్చలు జరిపారు. త్వరలోనే వారికి వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకునేలా చూడాలన్నారు.
Read More »