బీజేపీ విధానాలను ఆ పార్టీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ మోర్చా వంటి సంఘాలే తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..ఆ పార్టీకి మనమేందుకు ఓటెయ్యాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మొద్దని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్‌చేసినా మోదీ ప్రభుత్వం లెక్కచేయలేదని విమర్శించారు. దొడ్డువడ్లు కొనని, ఉద్యోగాలు ఊడబీకే బీజేపీకి ఓటెందుకు వేయాలని నిలదీశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం …
Read More »ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరి, …
Read More »హుజూరాబాద్ లో ఇప్పటివరకు 12,521 మందికి దళిత బంధు
దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్‌లో సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రు లు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »చేనేత రంగానికి రూ.73.42 కోట్లు విడుదల
చేనేత రంగానికి చెందిన వివిధ పథకాల కోసం ప్రభుత్వం రూ.73.42 కోట్లు విడుదలచేసింది. హాంక్ నూలు, రంగులకు 20 శాతం సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్ ప్రోత్సాహక పథకం, టెసో ఎక్స్ గ్రేషియాలు, చేనేత మిత్ర, క్యాష్ క్రెడిట్ రుణాలు, నేతన్నకు చేయుత తదితర పథకాలకు ఈ నిధులను ఖర్చుచేస్తారు. ఈ పథకాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష …
Read More »విద్యతోనే అభివృద్ధి -మంత్రి హరీశ్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ భౌతిక తరగతులు లేకున్నా.. ఆన్‌లైన్ క్లాసులతో బోధనకు అంతరాయం కలగకుండా కృషిచేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో విద్యకు అత్యంత …
Read More »తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్
తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. హుజురాబాద్‌కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని హరీష్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read More »తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గులాబీ జెండా పండుగ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్‌ఎస్ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్‌ఎస్ జెండాలను ఎగుర వేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని, టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. నల్లగొండలో గుత్తా.. నల్లగొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్ …
Read More »మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..?
మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్‌కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉపయోగమో ఆలోచించాలని ఓటర్లకు ఆయన సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏండ్లు …
Read More »తెలంగాణ వ్యాప్తంగా దళితబంధును అమలు చేసి తీరుతాం
దళితబంధు పథకంతో త్వరలో దళితుల జీవితాల్లో మార్పు చూడబోతున్నా మని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 16 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధు ఇంటింటి సర్వేపై స్పెషల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర …
Read More »దళితబంధును విజయవంతం చేసే బాధ్యత దళిత యువతదే: సీఎం కేసీఆర్
దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్ననే 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. ఈ 75 ఏండ్లలో భారతదేశంలో ప్రధాని, పార్టీ కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా? కనీసం వాళ్ల మైండ్‌కైనా వచ్చిందా? ఆ దిశగా …
Read More »