హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో ఉన్నారు. బీజేపీకి 4610 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,444 ఓట్లు వచ్చాయి
Read More »Huzurabad By Poll Results-పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ముందంజలో TRS
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ ముప్పై తారీఖున జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగనుంది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగనుంది. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో రౌండ్‌కు …
Read More »పారిస్ లో మంత్రి కేటీఆర్ Busy Busy
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్ ఎగువ సభలో (సెనేట్) జరిగే ‘యాంబిషన్ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్-డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కొవిడ్ ఎరా (కొవిడ్ తర్వాత భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …
Read More »మంత్రి హారీష్ రావు సవాల్ – పరారైన బీజేపీ
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్‌ఎస్ బయట పెట్టింది. కమలం పార్టీకి హుజూరాబాద్ ప్రజలు ఓటు ఎందుకెయ్యాలో చెప్పాలని ఎన్నిసార్లు డిమాండ్‌చేసినా ముఖం చాటేసింది. మంత్రి హరీశ్‌రావు ఎన్ని సవాళ్లు విసిరినా సమాధానం చెప్పకుండా ఆ పార్టీ నాయకులు పరారయ్యారు. విచిత్రం ఏమిటంటే.. ఏ ఒక్క సవాల్‌కు కాషాయం పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కమలం పార్టీ నాయకుల …
Read More »వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు అందిన దళితబంధు పథకం ఫలాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు దళితబంధు పథకం ఫలాలు అందాయి. బుధవారం పండుగ వాతావరణంలో యూనిట్ల పంపిణీని చేశారు. కూలీనాలీ చేసుకొంటూ జీవనం సాగించిన నిరుపేద దళిత కుటుంబాల వారు ఇప్పుడు ఓనర్లుగా మారి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో గతంలోనే జమ చేశారు. తాజాగా వీరిలో ముగ్గురికి …
Read More »గెల్లు శీనుకు 25వేల మెజార్టీ ఖాయం
‘హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైపోయింది. ఆయన 25 వేల ఓట్ల మెజారిటీ సాధించబోతున్నారు. బుధవారం ఉదయమే మనకు అందిన తాజా సర్వేల్లో ఈ విషయం తేటతెల్లమైంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏ సర్వే చూసినా టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని చెప్తున్నదని, చివరికి బీజేపీ వాళ్ల సర్వేలో కూడా ఇదే తేలడంతో కొంత మంది ఆ పార్టీ నాయకులు ఫోన్లు నేలకేసి కొట్టుకుంటున్నారని తెలిపారు. …
Read More »ఖాయమైన గెల్లు శ్రీను గెలుపు
అబద్ధాలకు, కుటిలనీతికి కాలం చెల్లిపోతున్నదా? అభివృద్ధి, సంక్షేమానికే హుజూరాబాద్ ఓటర్లు ఓటు వేయబోతున్నారా? ఇంటిపార్టీకే అండగా నిలువాలని నిర్ణయించుకొన్నారా? హుజూరాబాద్‌లో ఎవరి నోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసం విస్పష్టంగా కనిపిస్తున్నది. ఉప ఎన్నిక ఏకపక్షంగా జరుగబోతున్నదని తేలిపోయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. మోయలేని భారంగా మారిన గ్యాస్‌బండకు దండం పెట్టి బీజేపీని కోదండమెక్కించాలని …
Read More »600 ఇయ్యనోళ్లు.. 3 వేల పింఛన్ ఇస్తరా?
‘గుజరాత్‌లో రూ.600 పింఛన్ ఇయ్యనోళ్లు హుజూరాబాద్‌లో మాత్రం రూ.3వేలు ఇస్తరట. అక్కడ ఇయ్యనోళ్లు ఇక్కడ ఇస్తరా? గీ బీజేపీ మ్యానిఫెస్టో చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థమైతలే’ అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అన్ని సర్వేల్లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని తెల్వడంతో ఓడిపోతామనే భయంతో బీజేపీవాళ్లు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన ధూంధాంకు టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, …
Read More »పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది
అబద్ధమాడినా అతికినట్టుండాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది.. అందుకే ఏకంగా తెలంగాణ అమరవీరులను కేసీఆర్.. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా స్మరించుకోలేదంటూ నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రపంచంలోని కోట్లమంది తెలంగాణ వాదులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. కేసీఆర్ ఏం మాట్లాడారో.. సభలో ఏం జరిగిందో కండ్లారా చూశారు. సమావేశం ఘనంగా జరిగిన తీరు చూసి రేవంత్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదేమో.. …
Read More »ఈటల రాజేందర్ అబద్ధాల పరాకాష్ట
వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడా వంద అబద్ధాలు ఆడుతూ ఏదోవిధంగా గట్టెక్కాలని చూస్తున్నాడు. అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం ఆయనకేకాదు.. ఆయన పార్టీ బీజేపీ నేతలకు అలవాటైపోయింది. అందరికంటే రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా వెలగబెట్టిన ఈ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన్నాటినుంచీ తన ఉనికిని కాపాడుకోవడం …
Read More »