తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం నామినేషన్లకు గడువు ముగియనున్నది. ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల పరిధిలో ఓటు వేయనున్న …
Read More »భూమి రికార్డుల నిర్వహణలో మైలురాయిగా ధరణి పోర్టల్
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని , ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ధరణి పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీ టి.హరీశ్ రావు అధ్యక్షత వహించారు. ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న వివిధ …
Read More »డిసెంబరులోగా కొత్త మెడికల్ కాలేజీల భవనాలను పూర్తి చేయాలి
ఆరోగ్యశ్రీకి అదనంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద 646 వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ అదనంగా చేర్చిన వైద్యసేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా 946 రకాల వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. శనివారం బీఆర్కే భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ICU వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అన్నారు…తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి గారు …
Read More »మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.
కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు. మా సమస్య.. మా నీళ్లు మాకు దక్కాలి.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు నియామకాల మీద. నీళ్ల విషయంలో ఏడేండ్ల నుంచి కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అక్రమంగా ఏపీ ప్రభుత్వం పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను తీసుకెళ్తుంది. కృస్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటా రావడం లేదు. కృష్ణా బేసిన్‌లో …
Read More »వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి తన్నీరు హారీష్ రావు సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయింది. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వేశాము. అదే సమయంలో జాతీయ స్థాయిలో మొదటి డోస్ 79 శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్‌లోని …
Read More »పక్కరాష్ట్రం వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?.-CM KCR
‘రాయలసీమ కరువు ప్రాంతం. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం జగన్మోహనరావుకు కూడా చెప్పా. ఈ విషయంలో ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించి మరీ ఇదే విషయం చెప్పా. బేసిన్‌లు, భేషజాలు అడ్డం పెట్టం. తప్పకుండా సహకరిస్తాం అని చెప్పా’ అని సీఎం కేసీఆర్ …
Read More »త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు: సీఎం కేసీఆర్
తెలంగాణలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఇందుకోసం ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ కోసం జోనల్ చట్టం తీసుకొచ్చామన్నారు. జోనల్ విధానం అమలు కారణంగా ఖాళీల భర్తీ కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ‘‘ మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి …
Read More »బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా..అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర …
Read More »Huzurabad By Poll Results-రోటీ మేకర్ గుర్తుకు 280 ఓట్లు..
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లో 122 ఓట్లు ,సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి 280ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటి మేకర్.. ఇది కారు గుర్తును పోలి ఉండటం పెద్ద కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 166 ఓట్ల ఆధిక్యంలో …
Read More »