వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు తెలంగాణలో జరిగే మేడారం మహాజాతర కోసం టీఎస్ఆర్టీసీ 3845 బస్సులను నడపనుంది. సుమారుగా 21 లక్షల మంది భక్తులు జాతరకు వస్తారనే అంచనాలతో 2020లోనూ ఈ స్థాయిలోనే బస్సులు నడిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో 2250 బస్సులను ఈ రీజియన్ నుంచే నడపనుంది. జాతర సమయంలో మేడారం వద్ద బస్సులు నిలిపేందుకు …
Read More »తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు Good News
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,217 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లెక్చరర్ల సర్వీసులను రెన్యువల్ చేశారు. 2022, మే 31 వరకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, రెన్యువల్ అయిన వారిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. కాగా, సర్కారు నిర్ణయం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Read More »తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం
తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన.. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని మంత్రి హరీష్ సూచించారు.
Read More »సిద్దిపేటలో ఓటు వేసిన మంత్రి హారీష్ రావు
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారిగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ప్రజాప్రతినిథులు మాత్రమే ఓటర్లు కావడంతో 99 శాతం ఓట్లు నమోదవుతాయని తెలిపారు. …
Read More »కొవిడ్ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలురాయి
కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా గురువారం నాటికి 4 కోట్ల డోసులను వేసింది. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా …
Read More »వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరం
తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే మార్గమని చెప్పారు. అందువల్ల ప్రజాప్రతినిథులు తమ పరిధిలో ఉన్న ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించారు. నగరంలోని కొండాపూర్ ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఆధునిక వసతులను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అదనపు పడకల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హారీష్ రావు Fire
తెలంగాణలో రైతన్నలు పండించే యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. వరి కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, కిషన్రెడ్డి.. తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం తీరు వల్లే రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనలేకపోతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Read More »నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా వత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పటంతో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. …
Read More »బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి ఉచితంగా మెడిసిన్ కిట్లు
తెలంగాణ రాష్ట్రంలో బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి దశల వారీగా ఉచితంగా మెడిసిన్ కిట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 20 లక్షల మంది బీపీ రోగులు, 7 లక్షల మంది షుగర్ రోగులు ఉన్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ సర్వేలో తేలింది. వీరికి ప్రభుత్వం ఇచ్చే కిట్లో నెలకు సరిపడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే బీపీ, షుగర్ మందులు ఉంటాయి. గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ …
Read More »క్షీరసాగర్ లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
ప్రజా ప్రయోజనార్థం గ్రామ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం, కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ …
Read More »