తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు టీఆర్ఎస్ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో వారి మద్దతుదారులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Read More »పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్న YS Sharmila
ప్రజాప్రస్థానం పేరిట YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునఃప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనుకున్నారు.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లాలోని కొండపాకగూడెం వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించనున్నారు.
Read More »బీసీలకు తెలంగాణ సర్కారు Good News
తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో బీసీలకు వయో పరిమితిలో 10ఏళ్ల సడలింపును వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ కులాలతో పాటు వికలాంగులకు సంబంధిత రిజర్వేషన్లు, నియామకాలు, వయోపరిమితి, ఇతర ప్రయోజనాలను 2031 మే 31వ తేదీ వరకు అమలు చేసేలా ఆదేశాలిచ్చారు
Read More »సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి హెచ్చరించారు
Read More »‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో పథకం ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫైల్) సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికోసం పైలట్ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్‌లో …
Read More »ఇంటర్ పాసైనవారికి తెలంగాణ సర్కారు శుభవార్త
కనీస మార్కులతో(35) ఇంటర్ పాసైనవారిని కూడా ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్ కు అర్హత లభిస్తుంది. కరోనాతో రెండేళ్లుగా సరిగ్గా క్లాసులు జరగక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 40 మార్కులు వస్తేనే ఎంసెట్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది.
Read More »కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడపాలి- సీఎం కేసీఆర్
దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారు. ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ …
Read More »ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి…..
ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఆశా కార్యకర్తలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 43 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆశా …
Read More »రాంచీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
జార్ఖండ్ రాజధాని రాంచీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు రాంచీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. మరికాసేపట్లో జార్ఖండ్ గిరిజన ఉద్యమకారుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్.. నేరుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక …
Read More »