తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు. చెడుపై మంచి గెలిచిన రోజని, ప్రేమ, దయ, కరుణాగుణాన్ని సిలువపై తన జీవితం ద్వారా యేసు క్రీస్తు ప్రపంచానికి చాటిచెప్పిన రోజన్నారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని ఈస్టర్ సందర్భంగా కోరుకున్నారు.
Read More »ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషన్ డోస్ కు అనుమతించండి -కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ
ప్రభుత్వం వైద్యంలో 18-59 వయస్సు వారికి కరోనా నుంచి రక్షణకు ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అనుమతివ్వాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. భవిష్యత్‌లో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో, రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుక్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. ఈ …
Read More »కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి భూమి పూజ…..
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ తిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ కంఠమేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read More »పది తరాలు పనికొచ్చే పని చేసేందుకు బయలుదేరిన
వచ్చే వానాకాలం లోపు వంద ఏకరాలు ఆయిల్ ఫామ్ తోటలు నాటాలని గ్రామస్తులను మంత్రి హరీశ్ రావు కోరారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం అప్పలాయచెరువు గ్రామంలో బుధవారం ఉదయం అభయాంజనేయ స్వామి, శివ పంచాయతన నవగ్రహా, నాగదేవత ప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆంజనేయ …
Read More »18 నెలల్లో వరంగల్ దవాఖాన సిద్దం..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి.రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దవాఖానను 19 ఎకరాల విస్తీర్ణంలో 27 అంతస్తులతో నిర్మించనున్నారు. రూ.1,116 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఎల్ అండీ టీ సంస్థ ఈ నెల 4న అంగీకారపత్రం (లెటర్ ఆఫ్ …
Read More »బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
కుల రహిత సమాజం కోసం పాటుపడి, దళితుల అభ్యున్నతి కోసం అనేక సేవలను అందించిన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నందు నిర్వహించిన వేడుకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారితో కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి …
Read More »అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. ట్యాంక్ బండ్ పై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అక్కడే ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ తో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరానివారికి సమానత్వం …
Read More »అంబేద్కర్, జగ్జివన్‌రామ్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు- మంత్రి హరీష్‌రావు
జగ్జివన్‌రామ్ 1952 నుండి వరసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం జగ్జివన్‌రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. గాంధీజీ ఎన్నో సందర్భాలలో జగ్జివన్ రామ్‌ను కొనియాడారన్నారు. ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా.. చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. …
Read More »డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ గారు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు.ఏప్రిల్ 05, 2022వ తేదీ జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం తెలంగాణతల్లి సర్కిల్ లో గల జగ్జీవన్ రాం గారి విగ్రహానికి, Vdo’s కాలనీ క్యాంపు కార్యలయం, గట్టయ్య సెంటర్ లోని తెరాస జిల్లా పార్టీ …
Read More »అందరికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శనేత డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్
సమాజంలో కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని పేర్కొన్నారు. మంగళవారం జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవల్ని సీఎం స్మరించుకొని నివాళులు అర్పించారు. జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని …
Read More »