తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి మంత్రి తన్నీరు హరీష్ రావుపై విమర్శలు వర్షం కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” మంత్రి హరీష్ రావుకు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయీ, అర్హత లేదని అన్నారు. నిన్న పెద్దపల్లిలో మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్? నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు …
Read More »తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈనెల మే 30న పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి విదితమే. దీంతో ఆయన రాజ్యసభకు …
Read More »ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు
టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఓ అపరిచితుడి మాదిరిగా, అరాచకం సృష్టించే వాడిగా తయారయ్యాడని మండిపడ్డారు. నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలే మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. పసుపు బోర్డుపై మాట తప్పిన అరవింద్‌ను జీవితాంతం బాండ్ పేపర్లు వెంటాడుతూనే ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ కవిత సంస్కారంగా మాట్లాడితే.. అరవింద్ మాత్రం ఏకవచనంతో సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని కోపోద్రిక్తులయ్యారు. స్పైస్ బోర్డుకు …
Read More »తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ళుగా పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ఆటలు ఇక రాష్ట్రంలోసాగనివ్వబోమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హెచ్చరించారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మళ్లీ సిరిసిల్లకు వెళ్తాను. వెళ్తే చంపుతారా.. అరెస్టు చేస్తారో చెప్పాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనపై డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్తే దాడి చేయించారని …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మాట్లాడుతూ” పాలమూరు నుంచి వలసలు లేవని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. వలసలు ఉన్నాయని నిరూపించడానికి తాను సిద్ధమని చెప్పారు. దేవరకద్ర బహిరంగసభలో …
Read More »కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ దంపతులు
జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు మందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం హరీశ్ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్చనం అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు …
Read More »అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మోకాలి చిప్పలు మార్పిడి చికిత్స
గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట దవాఖానలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి …
Read More »ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగళవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా వద్ద ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తూ, వారి శ్రేయస్సు కోసం …
Read More »తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ కింద అలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు.తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో కమలా సోసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోందని …
Read More »నేడు ఢిల్లీకి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరగనున్న న్యాయ సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు. సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్రాస్టక్టర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో …
Read More »