తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది DSP, ఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు చేశారు.ఈ బదిలీల్లో భాగంగా యాదాద్రి డిఎస్పీగా రమేష్ కుమార్, నల్గొండ SPDOగా శివరాంరెడ్డి, కోదాడ SPDOగా శ్రీధర్ రెడ్డి, ఆదిలాబాద్ డిఎస్పీగా ప్రకాష్, మాదాపూర్ ACP Y.శ్రీనివాస్ కుమార్ నియమితులయ్యారు.
Read More »ప్రజా భవన్‌లో మొదలైన ప్రజావాణి కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు …
Read More »డిప్యూటీ సీఎం భట్టిని గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు …
Read More »తెలంగాణలో రేపటి నుంచి ఆ స్కూళ్లకు సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్మస్ పండుగ సందర్భంగా మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. కొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25, 26(బాక్సింగ్ డే) తేదీల్లో సెలవు ప్రకటించారు.. మరికొన్ని స్కూళ్లకు డిసెంబర్ 25న మాత్రమే ఇచ్చారు. డిసెంబర్ 26వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది.
Read More »సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో జరగనున్న సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను మార్చికి వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధనశాఖ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
Read More »విద్యుత్ అప్పులు రూ.81,516 కోట్ల అప్పు
తెలంగాణ రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ పాలన మొదలైన దగ్గర నుండి విద్యుత్ రంగంలో ఇప్పటివరకు రూ.81,516 కోట్ల అప్పు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈరోజు గురువారం రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కంలకు రూ.62,461కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు.
Read More »అప్పులతో ఆస్తులు పెంచినం
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలకు విద్యుత్ అందించామని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే… మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ‘2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ ₹44,434 కోట్లు. అప్పులు ₹22,423 కోట్లు. ప్రస్తుతం విద్యుత్ రంగ ఆస్తుల విలువ ₹1,37,570 కోట్లు ఉంది.. అప్పుల విలువ ₹81,516 కోట్లుగా ఉంది. అప్పులు చేసి ఆస్తులు సృష్టించాం. కాంగ్రెస్ పాలనలో …
Read More »సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్ధు
తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్.. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు గురువారం వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది. ఢిల్లీలో ఈ రోజు గురువారం నుండి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, తాజాగా ఆ పర్యటన రద్దయింది.
Read More »ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తాం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయింట్‌లో వివరాలను వెల్లడించారు. మంగళవారం 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో ఎక్కువ అప్లికేషన్లు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం వచ్చాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో …
Read More »జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం
తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మంగళవారం ఉదయం జూనియర్ డాక్టర్లు సమావేశమై తమ సమస్యలను వివరించారు. ఈ సమావేశం అనంతరం జూనియర్ డాక్టర్లు మీడియాతో మాట్లాడారు.వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. పీజీ విద్యార్థులు వస్తున్న …
Read More »