SWACH SURVEKSHAN: స్వచ్ఛ భారత్ అవార్డులో తెలంగాణ సత్తాచాటిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రకటించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో రెండు వేర్వేరు విభాగాల్లో.. తొలి మూడుస్థానాలతో నంబర్ 1గా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. అక్టోబర్ –డిసెంబర్-2022 త్రైమాసికానికి స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ అవార్డులు వరించాయి. స్టార్ త్రీ …
Read More »MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రీతి తల్లిదండ్రులకు కవిత లేఖ రాశారు. ప్రీతి మరణం తనను ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారకులపై ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ట్విటర్ వేదికగా ప్రీతికి ఎమ్మెల్సీ కవిత సంతాపం …
Read More »MAHABUBNAGAR: ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయం
MAHABUBNAGAR: మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి వద్ద ఐటీ కం మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్‌లో విద్యార్థులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. దివిటిపల్లిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రి వర్గం పనిచేస్తోందని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కొందరు ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడ్డ పాలమూరును …
Read More »KCR TWEET: ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియా అరెస్టు
KCR TWEET: ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారని…….ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది వేధింపులు తప్ప మరోకటి కాదని మండిపడ్డారు. అయితే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. దీన్ని ఖండిస్తూ….భారాస అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారు. దిల్లీ మద్యం లిక్కర్ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం దిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. సిసోడియా …
Read More »KTR: రాష్ట్రప్రజలందరినీ కేసీఆర్ కుటుంబంలా చూసుకుంటున్నారు: కేటీఆర్
KTR: రాష్ట్రంలోని ప్రజలందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలాగానే చూసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఏ విధంగా విమర్శించలేకనే కుటుంబపాలన అంటున్నారని మండిపడ్డారు. విపక్షాలకు విమర్శించడం తప్ప మరో ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు చెప్పినట్టు మాది కుటుంబపాలనే అని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. కాకపోతే ప్రజలే మా కుటుంబం….కాబట్టి అందుకే మాది కుటుంబపాలన అని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి కుటుబంలో కేసీఆర్ …
Read More »KTR: మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలపై సమావేశం
KTR: మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలపై సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. దానివల్ల కోటి కుటుంబాలకు లబ్ధి …
Read More »KTR: భాజపా….రాష్ట్రానికే కాదు దేశానికే పట్టిన దరిద్రంమని మంత్రి కేటీఆర్
KTR: హనుమకొండ స్టేషన్ ఘన్‌పూర్ లో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భాజపా…. రాష్ట్రానికే కాదు దేశానికే పట్టిన దరిద్రమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ 8 ఏళ్ల పాలనలో కేంద్రం మాటలు తప్ప తెలంగాణకు చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి 15 లక్షల రూపాయలు జమచేస్తామన్న మోదీ…..ఇంత వరకు దాని జాడే లేదని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు …
Read More »GANGULA: వాటర్ ఫౌంటైన్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ
GANGULA: కరీంనగర్‌లో వాటర్ ఫౌంటైన్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బాలకిషన్ పాల్గొన్నారు. మానేర్ రివర్ ఫ్రంట్ లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 69 కోట్ల రూపాయలతో వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఫౌంటెన్‌లో ఫైర్, లేజర్, ప్రొజెక్టర్స్ ఉంటాయని వెల్లడించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు …
Read More »Harish rao: తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ప్రదాత: మంత్రి హరీశ్
Harish rao: సంగారెడ్డి కురుమ సంఘం బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య……స్ఫూర్తి ప్రదాత అని మంత్రి కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలో త్వరలో కురుమ భవన్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్…….రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని….దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. యూనిట్ …
Read More »jagadeesh: భవిష్యత్తు భారాసదే మంత్రి: జగదీశ్
jagadeesh: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల గృహ సముదాయంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్..మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. ఎండీ అహ్మద కు పార్టీ కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని మంత్రి జగదీశ్ వెల్లండించారు. …
Read More »