Home / Tag Archives: test series (page 5)

Tag Archives: test series

నేడే సౌతాఫ్రికా-టీమిండియా మధ్య రెండో వన్డే

దక్షిణాఫ్రికాతో జరిగిన  టెస్టు సిరీస్ ఇప్పటికే  కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమి పాలైన టీమిండియాకు నేడు చావోరేవో మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ 1లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. వరుస విజయాలతో దక్షిణాఫ్రికా ఉత్సాహంతో ఉండగా, ఎలాగైనా రెండో వన్డేలో గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో ఇరు మార్పుల్లేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది.

Read More »

తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం

మూడు వన్డేల సీరిస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. సఫారీ బౌలర్ల దాటికి 265/8 పరుగులకే పరిమితం అయ్యింది. చివర్లో శార్థూల్(50*) పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. ధావన్ 79, కోహ్లి 51 పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, షంసీ, ఫెహ్లుక్వాయో తలో 2వికెట్లు తీయగా, మహరాజ్, మార్క్రమ్ …

Read More »

ఇంగ్లండ్ 188 పరుగులకే ఆలౌట్

యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ రెండో రోజు ఇంగ్లండ్ 188 పరుగులకే కుప్పకూలింది. మరోసారి ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. క్రిస్ వోక్స్(36), రూట్ (34), బిల్లింగ్స్ (29), మలాన్(25) క్రావ్ (18) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కమిన్స్ (4వికెట్లు), స్టార్క్ (3వికెట్లు), బోలాండ్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 303 …

Read More »

సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా

సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 1-2తేడాతో భారత్ కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికాలో సిరీస్ గెలవాలన్న కల నెరవేరకుండానే పోయింది. సౌతాఫ్రికా టీమ్ పీటర్సన్-82, డుసెన్-41, ఎల్గర్-30 రాణించారు. * టీమిండియా స్కోర్లు 223 & 198 * సౌతాఫ్రికా స్కోర్లు 210 & 212/3

Read More »

రిషబ్ పంత్ అరుదైన రికార్డు

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ పంత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసియా బయట 3 సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఆసియా బయట సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్లు. * మంజ్రేకర్ 118(వెస్టీండిస్ పై కింగ్ డన్ లో ) * రాత్రా 115*(వెస్టీండిస్ పై, సెయింట్ జాన్స్ లో 2002) * సాహా 104 (వెస్టీండిస్ పై, గ్రాస్ ఐలెట్ లో 2016) …

Read More »

టీమిండియా 198 పరుగులకి ఆలౌట్

కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 67.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 211లీడ్ సాధించింది. పంత్ 100తో రాణించాడు. మిగితా బ్యాట్స్మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్ల చొప్పున తీశారు. అంతకుముందు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా …

Read More »

70రన్స్ లీడ్ లో టీమిండియా

ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3వ టెస్టులో 2వ రోజు ఆట పూర్తయింది. 2వ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ స్టంప్స్ సమయానికి 2వికెట్లు కోల్పోయి 57పరుగులు చేసింది. రాహుల్-10, మయాంక్-7 మరోసారి విఫలమయ్యారు. కోహ్లి-14, పుజారా-9 క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది. పేసర్ బూమ్రా.. సఫారీల నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 223రన్స్ చేసింది. ప్రస్తుతానికి 70రన్స్ లీడ్ ఉంది.

Read More »

కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు

సౌతాఫ్రికా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 టెస్టు క్యాచ్లు అందుకొని కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో అజారుద్దిన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.

Read More »

210పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

కేప్టాన్ లో జరుగుతున్న నిర్ణయాత్మక 3వ టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ని భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో సఫారీ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ 210పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో పీటర్సన్-72 రాణించాడు. మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో బుమ్రా-5, ఉమేశ్ యాదవ్-2, షమీ-2, శార్దూల్ ఠాకూర్-1 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ భారత్ 223రన్స్ చేసింది. 13పరుగులు ముందంజలో ఉంది.

Read More »

టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)తో చెలరేగాడు. లాథమ్తో పాటు కాన్వే సెంచరీ(109)తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 521/6 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లాం 2, ఇబాదత్ హొస్సేన్ 2, మొమినుల్ ఒక వికెట్ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat