తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర శాఖ బస్సు యాత్రకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. మాజీ సీనియర్ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ.. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ యాత్ర ఈ నెల ఇరవై మూడో తారీఖున మొదలు కానున్నది. …
Read More »తెలంగాణలో టీడీపీ వినూత్న కార్యక్రమం
తెలంగాణలో టీడీపీ ఓ సరికొత్త కార్యక్రమం మొదలెట్టనున్నది. ఇందులో భాగంగా రేపటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రేపు ఉదయం సోమవారం నాడు 10గంటలకు టీడీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వివరించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …
Read More »తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో తెలుసా..?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు TTDP అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. వచ్చింది.
Read More »టీడీపీకి ఎల్ రమణ రాజీనామా
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు రమణ పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ర్ట ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని రమణ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన …
Read More »ఎంపీ రేవంత్ కు భారీ షాక్
దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదు. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్ రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇటీవలే ఈ కేసుపై …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …
Read More »నాగార్జున సాగర్ ఉప ఎన్నిక-టీడీపీ అభ్యర్థి ఖరారు…
తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది మువ్వా అరుణ్‌కుమార్ పోటీచేస్తారని టీడీపీ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ శనివారం తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడే టీడీపీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. …
Read More »తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ
తెలుగుదేశం పార్టీ కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు ఎల్. రమణను కొనసాగిస్తూ చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రమణను తొలగించి, మరొకరిని అవకాశం ఇవ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే చంద్రబాబును డిమాండ్ చేశారు. దీంతో టీటీడీపీలో కాస్త అలజడి రేగింది. కానీ… ఎల్. రమణ బలమైన బీసీ నేత కావడం…. తెలంగాణలో పార్టీ కష్టకాలంలో …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ దివంగత ముఖ్యమంత్రి,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు పిలుపుతో కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీ కండువా కప్పుకుని 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్వీఎల్ నరసింహారావు కన్నుమూశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన పలు ఉద్యమాలు,పోరటాలకు అండగా నిలిచిన నరసింహారావు 1995లో ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసి దివంగత మాజీ …
Read More »సోయి తప్పి మాట్లాడుతున్న ప్రతిపక్షాలు..!
తెలంగాణలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”నిజనిజాలను పక్క త్రోవపట్టించి.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆయన ఈ రోజు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. …
Read More »