తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో బద్ధిపోచమ్మ ఆలయాన్ని మహా పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నారాయణరావు పేటలోని ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..బద్ధిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా రోజుల నుంచి చూస్తున్నానని, ఆ ఆశ ఇప్పటికి తీరిందని అన్నారు. ఆలయం మళ్లీ ప్రారంభం …
Read More »అమ్మానాన్నల్లో ఎవరు కావాలి..? పాప జవాబుకు చలించి అక్కున చేర్చుకున్న జడ్జి!
ఆ ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారు. పాప ఎవరి దగ్గర ఉండాలని విషయమై జడ్జి ఆ చిన్నారిని అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అని అడిగింది. దీంతో ఆ చిన్నారి తడుముకోకుండా చెప్పిన ఆన్సర్‌కు జడ్జి సైతం చలించిపోయారు. షాద్‌నగర్ పట్టణంలోని కోర్టులో శనివారం ఈ ఘటన జరిగింది. కల్వకుర్తి పరిధిలోని మాడ్గుల గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు డివోర్స్ కావాలంటూ లోక్‌అదాలత్‌లో భాగంగా న్యాయమూర్తిని ఆశ్రయించారు. …
Read More »సంక్రాంతికి కొత్త సచివాలయం..!
రాష్ర్టంలో కొత్త సచివాలయం బిల్డింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రానున్న సంక్రాంతికి కొత్త సచివాలయాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కీలకమైన భారీ డోమ్‌ల నిర్మాణం, బిల్డింగ్ లోపల ఫినిషింగ్ పనులు, చుట్టూ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, పచ్చికబయళ్ల పనులు మాత్రమే చేయాల్సి ఉంది. రాజస్థాన్ ధోల్పూర్ నుంచి తెప్పించిన ఎర్ర రాయితో కొత్త సచివాలయం బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం దీనిలో …
Read More »హీరోలందరూ కలిసే ఉంటారు.. ఫ్యాన్సే తన్నుకుంటారు: లక్ష్మి
మా ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి మంచు ఫ్యామిలీ విపరీతంగా ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మా అధ్యక్షుడు అయ్యాక తనపై నెగిటివ్ ప్రచారం జరిగిందని విష్ణు అన్నారు. వాటిపై మంచు లక్ష్మి స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజకీయం అంటేనే ఒకరు బాగున్నారు అంటే.. అతనిపై బురద జల్లేందుకు మరొకరు రెడీగా ఉంటారని అన్నారు మంచు లక్ష్మి. …
Read More »టీఆర్‌ఎస్ ఇప్పటినుంచి బీఆర్ఎస్..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్… భారత్ రాష్ట్ర సమితిగా మారింది. అనంతరం ఈ తీర్మానంపై సీఎం సంతకం చేశారు. ఈ పేరు మార్పును పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశామని తెలిపారు. కేసీఆర్ పార్టీ పేరు చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.
Read More »నేడు తెలంగాణలో సెలవు
తెలంగాణ రాష్ట్రంలో నేడు సెలవు దినంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నేడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు త్రివర్ణ జెండాను ఎగురవేయనున్నారు.
Read More »నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
రాష్ట్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రేపటికి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించింది ప్రభుత్వం. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రేపు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టనున్నారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. మినిస్టర్లు, …
Read More »బీజేపీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ.. బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక మంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా బీజేపీ సభ్యులు ఈటల రాజేదర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ పదేపదే అడ్డుతగిలారు. బడ్జెట్ ప్రసంగం సజావుగా సాగేందుకు ఇబ్బంది కావడంతో బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారిని సస్పెండ్ చేశారు. బడ్జెట్ …
Read More »