సివిల్స్ -2020 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని కేటీఆర్ ట్వీట్ చేశారు. 100 లోపు ర్యాంకు సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 9 మంది ఉన్నారు. వరంగల్‌కు చెందిన శ్రీజకు 20వ ర్యాంకు, వై మేఘస్వరూప్ …
Read More »అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన తెలంగాణలోని ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను వాయిదావేసి.. విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేసింది. అప్పట్లో ఫస్టియర్‌లో 4.35 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న వీరందరికీ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. …
Read More »ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెట్ సిల్వర్ కాంపౌండ్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »కుల వృత్తులకు పూర్వ వైభవం
కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువులో చేప పిల్లలు విడుదల చేసి.. జిల్లాలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో నీళ్లు, కరెంటు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మూడేండ్లలోనే దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తిచేసుకొని …
Read More »అందరి సహాకారంతోనే ఆదిలాబాద్ అభివృద్ధి
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో …
Read More »మంత్రి కేటీఆర్ వినూత్న ట్వీట్
జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్ చేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.
Read More »కేంద్ర మంత్రితో మంత్రి తలసాని భేటీ…ఎందుకంటే..?
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి పరుషోత్తం రూపాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు, పథకాలకు కేంద్ర ప్రభుత్వం తరపున మద్దతు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర …
Read More »యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు టీఎస్‌ఐసీ ద్వారా ప్రభుత్వం కృషి
యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, డిజైన్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సొంతంగా ఎదిగేందుకు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. సెకండ్ ఎడిషన్‌లో భాగం గా టీఎస్‌ఐసీ, విద్యాశాఖ, యునిసెఫ్, యువా, ఇంక్విల్యాబ్ సంయుక్తంగా 50వేల మంది విద్యార్థుల ఆలోచనలను …
Read More »ఐటీ నియామకాల్లో హైదరాబాద్ కు రెండోస్థానం
ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్, పుణె నగరాలు చెరో 18 శాతంతో …
Read More »రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి తాను సిద్ధమని.. ఎయిమ్స్ టెస్టు కోసం రాహుల్ గాంధీ వస్తే తానూ వస్తానన్నారు. చర్లపల్లిలో జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ను ఒప్పించాలన్నారు. తాను టెస్టు చేయించుకుని క్లీన్ చీట్ వస్తే పదవి నుంచి తప్పుకుంటారా అని అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని …
Read More »